నాగబాబు నిర్మించిన చిరంజీవి సినిమాలు.. వాటి రిజల్ట్ ఏంటో తెలుసా.?

నాగబాబు.అలియాస్ నాగేంద్రబాబు, చిరంజీవి తమ్ముడిగా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.

నటుడిగా, నిర్మాతగా, బుల్లితెర జడ్జిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈయన హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించాడు.

అందులో ఎక్కువగా వారి అన్నయ్య సినిమాలే ఉన్నాయి.  ఇంతకి   వీరిద్దరి  కాంబినేషన్ లో  వచ్చిన సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నాగబాబు.తన అన్నతో మొత్తం 5 సినిమాలను నిర్మించాడు.

ఈ సినిమాలను తన తల్లి అంజనాదేవి పేరుతో ఏర్పాటు చేసిన అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించాడు.

అందులో మొదటిది రుద్రవీణ.కే.

బాలచందర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాకు జాతీయ స్థాయి అవార్డు వచ్చింది.

కానీ అనుకున్నంత స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు.నాగబాబు-చిరంజీవి కాంబోలో వచ్చిన మరో సినిమా త్రినేత్రుడు .

ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.

చిరంజీవితో నిర్మించిన మూడో సినిమా ముగ్గురు మొనగాళ్లు.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.

"""/" / అటు చిరంజీవి, నాగబాబు కలిసి చేసిన మరో సినిమా బావగారూ బాగున్నారా.

జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.నాగబాబు నిర్మించిన చిరు సినిమాల్లో మంచి విజయాన్ని దక్కించుకున్న సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.

చిరంజీవితో కలిసి నాగబాబు నిర్మించిన ఐదో చిత్రం స్టాలిన్.ఏ.

ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేదు.

"""/" / నిర్మాత గానే కాకుండా చిరంజీవితో కలిసి పలు సినిమాల్లోనూ నటించాడు నాగబాబు.

రాక్షసుడు సినిమాతో నాగబాబు తొలిసారి వెండి తెరపై దర్శనం ఇచ్చాడు.ఆ తర్వాత త్రినేత్రుడు, మరణ మృదంగం, కొండవీటి దొంగ, మృగరాజు, హ్యాండ్సప్, బావగారూ బాగున్నారా, అంజి చిత్రాల్లో యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

పలు రకాల క్యారెక్టర్లు చేసి శభాష్ అనిపించుకున్నాడు.

చంద్రబాబు మోసాలకు చెంప చెళ్లుమనిపించేలా సమాధానం చెప్పాలి..: సీఎం జగన్