కూతురి ఛాన్స్ మిస్సైంది.. చెల్లిగా నటించింది.. చిరు మూవీ ఛాన్స్ మిస్సైన నటి ఎవరంటే?
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవికి ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా చిరంజీవి( Chiranjeevi) సినిమాలో నటించే అవకాశం అంటే ఎవరూ వదులుకోరనే సంగతి తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో అబవ్ యావరేజ్ గా నిలిచిన సినిమాలలో డాడీ సినిమా( Daddy) ఒకటి కాగా ఈ సినిమాలో చిన్న పాప పాత్రలో మొదట కీర్తి సురేష్ పేరును పరిశీలించి కొన్ని సీన్స్ సైతం షూట్ చేశారట.
అయితే ఆ ఫుటేజ్ మరీ ఆకట్టుకునేలా లేకపోవడంతో ఆ చిన్నారిని తీసేశారట. """/" /
అలా కీర్తి సురేష్ ( Keerthi Suresh)స్థానంలో మరో చిన్నారికి ఛాన్స్ దక్కింది.
అయితే చిరంజీవి కూతురిగా నటించే ఛాన్స్ మిస్ అయినా భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లిగా నటించారు.
అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకునే విషయంలో ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే.
చిరంజీవి, కీర్తి సురేష్ కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. """/" /
కీర్తి సురేష్ తల్లితో సైతం చిరంజీవి నటించిన సంగతి తెలిసిందే.
చిరంజీవి రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉంది.చిరంజీవి భారీ రేంజ్ లో పారితోషికం అందుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.
చిరంజీవి ఇతర భాషల మార్కెట్ పై కూడా దృష్టి పెడుతుండటం గమనార్హం.మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా( Vishwambhara )కు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.
చిరంజీవి మార్కెట్ కు అనుగుణంగా పారితోషికం అందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లు 150 కోట్ల రూపాయలు, అంతకంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కనున్నాయని సమాచారం అందుతోంది.
చిరంజీవి ప్రాజెక్ట్ ల ఎంపిక తీరు ఇతర స్టార్ హీరోలకు భిన్నంగా ఉండటం గమనార్హం.
ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది… రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!