‘మెగా157’ కూడా వచ్చేసింది.. ఈసారి స్ట్రైట్ ప్రాజెక్ట్ తో రచ్చ రచ్చే!

టాలీవుడ్ లెజెండరీ నటుడు మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి తెలియని వారు లేరు.

ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.మరి అలంటి లెజెండరీ నటుడు ఈ రోజు పుట్టిన రోజు జరుపు కుంటున్నారు.

చిరంజీవి తన 68వ పుట్టిన రోజును జరుపు కుంటున్న నేపథ్యంలో చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు విషెష్ చెబుతూ నెట్టింట హంగామా చేస్తున్నారు.

ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ, రాజకీయ ప్రముఖులు( Political Leaders ) కూడా మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా తమ విషెష్ తెలుపుతున్నారు.

ఇదిలా ఉండగా మెగాస్టార్ పుట్టిన రోజు నాడు ఆయన కొత్త సినిమాల అనౌన్స్ మెంట్ ఉంటుంది అనే టాక్ గత కొన్ని రోజులుగా వస్తూనే ఉంది.

మరి ముందు నుండి వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ ఈ రోజు ఈయన నెక్స్ట్ రెండు సినిమాలపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.

"""/" / చిరు నటించనున్న 156వ ప్రాజెక్ట్ ను మెగాస్టార్ కూతురు తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్( Gold Box Entertainments Banner ) పై నిర్మించనున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు.

డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా రివీల్ చేయలేదు.ఇక చిరు 157వ సినిమా అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది.

ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ స్థాయిలో నిర్మించనున్నారు. """/" / అనౌన్స్ మెంట్ పోస్టర్ కూడా అదిరిపోయింది.

ఈసారి చిరు రీమేక్స్ తో కాకుండా స్ట్రైట్ సినిమాలతోనే వస్తున్నట్టు తెలుస్తుంది.పంచభూతాల కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని పోస్టర్ ద్వారా చెప్పకనే చెప్పారు.

ఇక ఈ సినిమాను బింబిసార డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి తెరకెక్కిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు.

మరి బింబిసార వంటి హిట్ అందుకున్న వసిష్ఠ మెగాస్టార్ తో కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాను తీయబోతున్నట్టు తెలుస్తుంది.

చూడాలి ఈ రెండు సినిమాలతో చిరు ఎలాంటి హిట్స్ అందుకుంటారో.

ఉద్యోగాలు పీకేస్తున్నారని ఆఫీసు గుమ్మానికే చేతబడి.. కలకలం రేపుతున్న క్షుద్రపూజల సామాగ్రి..