Chiranjeevi Industry Hits: వరుసగా 6 ఇండస్ట్రీ హిట్స్ అందించిన మెగాస్టార్.. ఈ ఘనత ఆయనకు మాత్రమే సొంతం?

చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం చిరంజీవి వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈతరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇటీవల భోళా శంకర్( Bhola Shankar ) సినిమాతో ప్రేక్షకులను పలకరించగా ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

కాగా మెగాస్టార్ చిరంజీవికి సంబందించిన ఒకవార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"""/" / అదేమిటంటే నాలుగన్నర దశాబ్దాల కెరీర్ లో మొత్తం ఎనిమిది సార్లు ఇండస్ట్రీ హిట్స్ ని అందించారు చిరు.

తన కెరీర్ ని మలుపు తిప్పిన ఖైదీ తో( Khaidi ) మొదలుకుని ఇంద్ర( Indra ) వరకు అంటే సుమారు 20 ఏళ్ళ పాటు ఇండస్ట్రీ హిట్స్ తో వార్తల్లో నిలిచారు మెగాస్టార్.

ఖైదీ, ఇంద్ర మధ్యలో చిరంజీవి పేరిట నమోదైన ఇండస్ట్రీ హిట్స్ అన్నీ వరుస సంవత్సరాల్లో సందడి చేశాయి.

అంటే ఏడాదికి ఒక ఇండస్ట్రీ హిట్ చొప్పున ఆరేళ్ళ పాటు ఆరు ఇండస్ట్రీ హిట్స్ చిరు ఖాతాలో చేరాయన్నమాట.

1987లో పసివాడి ప్రాణం, 1988లో యముడికి మొగుడు, 1989లో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

"""/" / 1990లో  జగదేక వీరుడు అతిలోక సుందరి,( Jagadeka Veerudu Athiloka Sundari ) 1991లో గ్యాంగ్ లీడర్,( Gang Leader ) 1992లో ఘరానా మొగుడు( Gharana Mogudu ) ఇలా వరుసగా ఆరు సంవత్సరాల్లో 6 ఇండస్ట్రీ హిట్స్ అందించారు చిరు.

ఇది ఒక రకంగా అరుదైన రికార్డు అనే చెప్పాలి.అంతే కాకుండా ఈ ఘనత కేవలం చిరంజీవికి మాత్రమే సొంతం అని చెప్పవచ్చు.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ఇటీవల విడుదలైన భోళా శంకర్ సినిమా ఘోరమైన డిజాస్టర్ ను చవిచూడడంతో పాటు భారీగా విమర్శలు నెగిటివ్ కామెంట్స్ ని ఎదుర్కొన్నారు.

కల్కి సినిమా బ్లాక్ బస్టర్ కావడానికి ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కారణమా.. ఏమైందంటే?