చిరంజీవి హిందీ చిత్రం ‘ప్రతిబంద్’ ఆరోజుల్లో ఎంత వసూళ్లను రాబట్టిందో తెలుసా..?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కి( Megastar Chiranjeevi ) ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన కెరీర్ ప్రారంభం లో ఎన్నో కష్టాలను ఎదురుకొని నేడు ఈ స్థాయికి వచ్చాడు.

తనతో పాటుగా తన కుటుంబ సబ్యులకు కూడా ఒక దారి చూపించి నేడు ఇండస్ట్రీ లో సూపర్ స్టార్స్ గా, పాన్ ఇండియన్ స్టార్స్ గా( Pan India Stars ) కొనసాగేందుకు దోహదపడ్డాడు.

నిత్యం కష్టపడే తత్త్వం, 68 ఏళ్ళ వయస్సు లో కూడా కుర్ర హీరోలతో పోటీ పడే తత్త్వం, ఈ వయస్సులో కూడా వంద కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను అలవోకగా కొట్టి, అత్యధిక వంద కోట్ల రూపాయిల షేర్ సినిమాలను కలిగిన ఏకైక హీరో గా చరిత్ర సృష్టించాడు.

విశేషం ఏమిటంటే నేటి తరం స్టార్ హీరోలలో చాలా మందికి ఒక్క 100 కోట్ల రూపాయిల షేర్ సినిమా కూడా లేదు.

"""/" / పాన్ ఇండియన్ హీరో అని ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న వార్త.

కానీ చిరంజీవి ఆరోజుల్లోనే హిందీ లో పలు సినిమాలు చేసి బాలీవుడ్ ని( Bollywood ) షేక్ చేసాడు.

అలాంటి సినిమాలలో ఒకటి 'ప్రతిబంద్'.( Pratibandh ) తెలుగు లో రాజశేఖర్ హీరో గా నటించిన సూపర్ హిట్ చిత్రం 'అంకుశం'( Ankusham Movie ) కి ఇది రీమేక్.

1990 వ సంవత్సరం అక్టోబర్ 6 వ తేదీన ఈ చిత్రం ముంబై లో నాలుగు థియేటర్స్ లో విడుదల అయ్యింది .

ఈ నాలుగు థియేటర్స్ హౌస్ ఫుల్ కెపాసిటీ 381171 రూపాయిలు.మొదటి వారం లో వచ్చిన వసూళ్లు 380820 రూపాయిలు.

అంటే నూటికి 99 శాతం ఆక్యుపెన్సీ లతో రన్ అయ్యింది అన్నమాట.ఈ స్థాయిలో ఒక హిందీ సినిమా ఆడడం ఆ ఏడాది ఎప్పుడు జరగలేదు.

అలా ప్రారంభమైన ఈ సినిమా షోస్ పెంచుకుంటూ పోయింది. """/" / ఫుల్ రన్ లో ఈ చిత్రానికి బాలీవుడ్ లో 5 కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు వచ్చాయి.

ఆరోజుల్లో ఇది అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ 5 బాలీవుడ్ చిత్రాలలో ఒకటిగా నిల్చి సంచలనం సృష్టించింది .

ఇక ఈ సినిమాతో పాటుగా అప్పట్లో చిరంజీవి 'ఆజ్ కా గూండా రాజ్',( Aaj Ka Goonda Raaj ) 'జెంటిల్ మ్యాన్'( Gentle Man ) వంటి సినిమాలను చేసాడు, ఇవి కూడా కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యాయి.

అలా మెగాస్టార్ అప్పట్లోనే పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని దంచి కొట్టేసాడు.

అలాగే ఆయన బాలీవుడ్ లో కొనసాగి ఉంటే నేడు అక్కడ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా ఎదిగేవాడేమో, కానీ ఆయన ఎక్కువగా టాలీవుడ్ ని నమ్ముకున్నాడు, ఇక్కడే స్థిరపడ్డాడు, అది మన తెలుగు ఆడియన్స్ చేసుకున్న అదృష్టం.

నటి కస్తూరిపై కేసు నమోదు.. క్షమాపణ చెప్పిన వదలడం లేదుగా!