గాడ్ పాదర్‌ పై అంచనాలు ఇప్పటికైనా పెరిగినట్లేనా భయ్యా..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సునీల్ ఇంకా పలువురు ముఖ్య నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, మలయాళం, తమిళం ఇలా అన్ని భాషల్లో కూడా గాడ్ ఫాదర్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి.

ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ నటించిన నేపథ్యంలో పబ్లిసిటీ ఆటోమేటిక్ గా వచ్చేసింది.అయినా కూడా చిత్ర యూనిట్ సభ్యులు తమ వంతు అన్నట్లుగా పబ్లిసిటీ చేయాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.

సినిమా విడుదలకు వారం రోజుల ముందు చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టారు.ఈ వారం రోజులలో సినిమా యొక్క అంచనాలు పెరుగుతాయా అంటూ కొందరు మెగా అభిమానులు మరియు మీడియా వర్గాల వారు అనుమానం వ్యక్తం చేశారు.

< -->కానీ ఒకే ఒక్క ట్రైలర్ తో సినిమా స్థాయిని గాడ్ ఫాదర్ చిత్ర యూనిట్ సభ్యులు అమాంతం పెంచేశారు.అది చాలదన్నట్లు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన మాటలు ముఖ్యంగా చివరి డైలాగ్ సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది అనడంలో సందేహం లేదు.

దేశ వ్యాప్తంగా కూడా ఈ సినిమా భారీ వసూలను నమోదు చేసే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే నమోదైన అంచనాలతో సినిమా మొదటి రోజు పాతిక కోట్ల రూపాయల వసూలను నమోదు చేసే అవకాశం ఉందంటూ మెగా అభిమానుల్లో కొందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మెగాస్టార్ కి రికార్డు స్థాయి ఓపెనింగ్ కలెక్షన్స్ ఈ సినిమా తో నమోదు అవ్వబోతుంది అంటూ సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.గాడ్ ఫాదర్ సినిమా మినిమం పాజిటివ్ టాక్ దక్కించుకున్నా కూడా ఈజీగా 100 కోట్ల వసూలను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్‌ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

క్లిక్ పూర్తిగా చదవండి

అంగారకుడిపై ఎలుగుబంటి ముఖం లాంటి వింత ఆకారం.. నాసా ఫొటో వైరల్!

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 28, శనివారం 2023

ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ ప్రచార రథం.. ఇంద్రకీలాద్రిపై జనసేనాని పూజలు

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 28, శనివారం 2023

ఇదెక్కడి ఐడియా బాబోయ్.. రూ.2,000 నోట్‌లా వెడ్డింగ్ కార్డు ప్రింట్!

ఢిల్లీ యూనివర్సిటీని తాకిన బీబీసీ డాక్యుమెంటరీ రగడ