ఒకప్పటి స్వాగ్ కావాలంటున్న ఫ్యాన్స్.. మరి వీరి కోరిక 'మెగా154' తీర్చనుందా?

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలకు కమిట్ అవ్వడమే కాకుండా ఆ సినిమాలను అంతే వేగంగా పూర్తి కూడా చేస్తున్నాడు.

ఏక కాలంలో రెండు సినిమాల షూటింగులు చేస్తూ యంగ్ హీరోల కన్నా బిజీ షెడ్యూల్స్ తో యాక్టివ్ గా సినిమాలను పూర్తి చేస్తున్నాడు.

ఈయన నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవలే దసరా రేస్ లో బరిలోకి దిగింది.

ఈ సినిమా మంచి టాక్ రావడంతో మెగాస్టార్ చాలా రోజుల తర్వాత చాలా ఖుషీగా ఉన్నాడు.

ఇక ఈ సినిమా ఇచ్చిన ఆనందంలో మరో సినిమా షూటింగ్ అప్పుడే షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

ప్రెసెంట్ చిరు చేస్తున్న సినిమాల్లో వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్) ఒకటి.మెగాస్టార్ 154వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.ప్రస్తుతం రాజమండ్రి లో కొత్త షెడ్యూల్ జరుగుతుంది.

ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. """/"/ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మాస్ రాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం విదితమే.

కొత్త షెడ్యూల్ లో మెగాస్టార్, రవితేజ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ పాత్ర గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది.

"""/"/ చిరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత మెగా ఫ్యాన్స్ ఆయన స్వాగ్ ను మిస్ అవుతున్నారు.

మరి తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మెగాస్టార్ ఊర మాస్ లుక్ లో కనిపించడమే కాకుండా ఆయన డైలాగ్స్ లోని స్వాగ్, స్టైల్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ వంటివి గతంలో ఎలా ఉన్నాయో ఇప్పుడు అలానే ఉండి పాత మెగాస్టార్ ను గుర్తు చేస్తాయట.

మరి ఈ విషయం తెలియడంతో మరింతగా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఈ దీపావళికి ఫస్ట్ లుక్ రాబోతున్న నేపథ్యంలో ఎలా ఉండబోతుందా అని ఎదురు చూస్తున్నారు.

జుట్టు రాలకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లైనా ఈ ఆయిల్ వాడండి!