చిరంజీవి చేసిన ఆ ఒక్క సినిమా ఇప్పుడు వచ్చుంటే ఇండస్ట్రీ హిట్ కొట్టేదా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్( Senior NTR ) తర్వాత అంతటి గొప్ప ఘన కీర్తి ని గడించిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు.
దాదాపు 40 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కొనసాగుతున్న ఆయన ప్రస్తుతం యంగ్ హీరోలతో పోటీపడి మరి సినిమాలను చేస్తూ భారీ సక్సెస్ లను అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
మరి ఆయన చేస్తున్న ప్రతి సినిమా మీద ప్రేక్షకులకు భారీ అంచనాలైతే ఉన్నాయి.
ఇక ఇప్పుడు విశ్వంభర సినిమాతో మరోసారి తన స్టామినాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
"""/" /
ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు చిరంజీవి( Chiranjeevi ) కోడి రామకృష్ణ దర్శకత్వంలో చేసిన అంజి సినిమా ( Anji Movie )విజువల్ గా చాలా గ్రాండియర్ గా ఉండటమే కాకుండా ప్రేక్షకులందరిని అమితంగా ఆకట్టుకుంటుంది.
నిజానికి అప్పుడు ఈ సినిమా రావడంతో అప్పుడున్న ప్రేక్షకులకు ఈ సినిమా అంతా పెద్దగా నచ్చలేదు.
కానీ ఇప్పుడు కనక ఆ సినిమా రిలీజ్ అయి ఉంటే ఇండస్ట్రీ హిట్ కొట్టేది అంటూ మరి కొంతమంది ఈ సినిమా మీద వాళ్ళ అభిప్రాయాలనైతే తెలియజేస్తూ ఉంటారు.
ఇక ఇప్పటికే చిరంజీవి చేసిన ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ మంచి విజయాలను సాధించుకుంటున్నాయి.
"""/" /
అయినప్పటికీ అంజి సినిమా మాత్రం ఆయన కెరియర్ లో ది బెస్ట్ సినిమా అని చెప్పుకోవడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఈ సినిమా కోసం చిరంజీవి చాలా సంవత్సరాల పాటు కష్టపడుతూనే వచ్చారు.అయినప్పటికీ ఆయన పడిన కష్టానికి ఫలితం మాత్రం పెద్దగా దక్కలేదు.
ఇక ఈ జనరేషన్ లో ఈ సినిమాని కనక రిలీజ్ చేసి ఉంటే పక్కాగా ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాకుండా చిరంజీవికి తప్పకుండా నేషనల్ అవార్డు కూడా వచ్చుండేదని కొంతమంది సినీ మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
మహేష్ బాబును టార్గెట్ చేయడం ఎంతవరకు రైట్.. ఇంతలా టార్గెట్ చేయాలా?