భోళా శంకర్ విషయంలో మనసు మార్చుకున్న మెగాస్టార్!

ఎన్నో రోజులుగా మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

రొటీన్ కమర్షియల్ సినిమా అయినా కూడా మెగా ఫ్యాన్స్ ను మెప్పించే అన్ని ఎలిమెంట్స్ తో డైరెక్టర్ బాబీ ఈ సినిమాను తెరకెక్కించాడు.

చిరంజీవి మాస్ మహారాజా రవితేజ కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా ప్రేక్షకులను మెప్పించి కోట్ల రూపాయలను వసూలు చేస్తుంది.

సంక్రాంతి సీజన్ లో వచ్చిన అన్ని సినిమాల కంటే ఈ సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబడుతుంది.

సంక్రాంతి మొనగాడు అనిపించుకున్న మెగాస్టార్ తన నెక్స్ట్ రాబోతున్న భోళా శంకర్ సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు.

మెగాస్టార్ నటిస్తున్న భోళా శంకర్ ఈ సమ్మర్ లో విడుదల అవుతుంది అని అంతా అనుకున్నారు.

కానీ చిరు వాల్తేరు ప్రమోషన్స్ లో ఈ సినిమా సమ్మర్ లో వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పేసాడు.

"""/"/ కానీ ఇప్పుడు వాల్తేరు వీరయ్య ఇచ్చిన బూస్ట్ తో నిర్ణయం మార్చుకున్నారట.

ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికి హౌస్ ఫుల్స్ అవుతూ కోట్లు రాబడుతున్న నేపథ్యంలో భోళా శంకర్ విషయంలో చిరు నిర్ణయం మార్చుకున్నట్టు టాక్ వస్తుంది.

ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి సమ్మర్ లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ బావిస్తుండడంతో ప్రెజెంట్ శరవేగంగా షూట్ జరుగుతుందట.

"""/"/ ఈ సినిమా కోసం హైదరాబాద్ లో కలకత్తా సెట్ ను కూడా రెడీ చేసారని ఇందులోనే షూట్ జరుగుతుందని తెలుస్తుంది.

వాల్తేరు వచ్చి వారం కాకుండానే భోళా సెట్ లో చిరు పాల్గొనడం వల్ల ఈ సినిమాను ఎంత ఫాస్ట్ గా పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్నారో అర్ధం అవుతుంది.

తమిళ్ మూవీ వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.

అలాగే ఇందులో చిరు చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది.ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.