మెగాస్టార్ చిరంజీవి ఆస్తుల లేటెస్ట్ లెక్కలు వింటే మాత్రం షాకవ్వాల్సిందే!

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ( Tollywood Megastar Chiranjeevi )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి నేడు కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఒక్కతెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో అభిమానులను సంపాదించుకున్నారు మెగాస్టార్.

ఇప్పటికీ అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈతరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు.

సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు మెగాస్టార్.

"""/" / ఇక ఎప్పటినుంచో సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న చిరంజీవి ఇప్పటివరకు చాలానే ఆస్తులు సంపాదించారనికి చెప్పవచ్చు.

అంచెలంచెలుగా ఎదుగుతూ చిరంజీవి సుప్రీం హీరో ఆ తర్వాత మెగాస్టార్ అయ్యారు.ఇండియాలో కోటి రూపాయలు పారితోషికం ( 1 Crore Remunaration )తీసుకున్న మొదటి హీరో చిరంజీవి.

గ్యాంగ్ లీడర్ సక్సెస్ తర్వాత చిరంజీవి రెమ్యూనరేషన్ కోటి రూపాయలు దాటేసింది.అమితాబ్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో అని ఒక ఆంగ్ల మీడియా కవర్ పేజ్ పై చిరంజీవి ఫోటో విడుదల చేసింది.

తనకు ఈ వైభవం అభిమానులు, ప్రేక్షకుల వలనే అని భావించిన చిరంజీవి బ్లడ్, ఐ బ్యాంకు ( Chiranjeevi Blood, I Bank )ఏర్పాటు చేశారు.

అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. """/" / ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమాకు రూ.

45 కోట్లు తీసుకుంటున్న విషయం తెలిసిందే.చిరంజీవి దేశంలోనే అత్యంత ధనవంతుడైన హీరో.

ఆయనకు విలాసవంతమైన భవనాలు.లగ్జరీ కార్లు, ఫార్మ్ హౌసులు, వ్యాపారాల్లో పెట్టుబడులు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.

ఇక హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 25లో చిరంజీవికి ఒక లగ్జరీ హౌస్ ఉంది.

అత్యంత అధునాతన సౌకర్యాలతో కూడిన ఈ విలాస భవనం విలువ రూ.50 కోట్లకు పైమాటే.

ఈ భవనం కోసం చిరంజీవి రూ.30 కోట్లు ఖర్చు చేశారట.

అలాగే చిరంజీవికి బెంగళూరులో ఫార్మ్ హౌస్ ఉంది.చెన్నైలో ఇళ్ళు ఉన్నాయి.

చిరంజీవి వద్ద అత్యంత ఖరీదైన కార్ కలెక్షన్ కూడా ఉంది.రోల్స్ రాయిస్ వాటిలో ప్రత్యేకం.

దానితో పాటు బెంజ్, రేంజ్ రోవర్, ఆడి, టయోటా హై ఎండ్ కార్స్ ఆయన కొనుగోలు చేశారు.

అంతే కాకుండా ప్రైవేట్ జెట్ కలిగిన అతికొద్ది మంది హీరోల్లో చిరంజీవి ఒకరు.

చిరంజీవి ఫ్యామిలీ డొమెస్టిక్ గా ఎక్కడికి వెళ్లాలన్నా ఈ ప్రైవేట్ జెట్ లో వెళతారు.

ఒక అంచనా ప్రకారం చిరంజీవి ఆస్తుల విలువ రూ.2 వేల కోట్లు పైగా ఉంటుందని అంచనా.

పోషకాల లోపం కనిపెట్టేదెలా.. ఆ సంకేతాలేంటి..?