చిరు ఎందుకు ఆ రీమేక్ ను మళ్లీ మళ్లీ వాయిదా వేస్తున్నాడు!
TeluguStop.com
మెగా స్టార్ చిరంజీవి సైరా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత ఆచార్య సినిమాను మొదలు పెట్టాడు.
ఆ సినిమా కాస్త కరోనా వల్ల చాలా ఆలస్యం అయ్యింది.ఇప్పటి వరకు సినిమా విడుదల కాలేదు.
ఇటీవలే ఆచార్యను వచ్చే ఏడాదిలో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.ఇక ఆచార్య తర్వాత చిరంజీవి మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ ను గాడ్ ఫాదర్ టైటిల్ తో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న గాడ్ ఫాదర్ ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
ఆచార్య తర్వాత గాడ్ ఫాదర్ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
గాడ్ ఫాదర్ సినిమా చిత్రీకరణ పూర్తి అయిన వెంటనే భోళా శంకర్ సినిమాను చిత్రీకరించబోతున్నట్లుగా మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.
భోళా శంకర్ సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు మళ్లీ కాస్త సమయం కావాలని చిరంజీవి అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
మెహర్ రమేష్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ గత ఏడాది లోనే మొదలు పెట్టాలని భావించినా కూడా అనుకున్నది అనుకున్నట్లుగా అస్సలు సాగడం లేదు.
మొన్నటి వరకు భోళా శంకర్ ను నవంబర్ లేడా డిసంఎబర్ అలో అన్నారు.
"""/"/ కాని ఇప్పడు మాత్రం అంతకు ముందు బాబీ దర్శకత్వం లో ఒక సినిమాను చేసేందుకు గాను సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది సమ్మర్ కు భోళా శంకర్ ను ప్రారంభిస్తారని తెలుస్తోంది.
ఈ సినిమా రీమేక్ విషయం లో ఎందుకు చిరంజీవి ఇంత గందరగోళం ను క్రియేట్ చేస్తున్నాడో అర్థం కావడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా జుట్టు పీక్కుంటున్నారు.
ఛీ.. ఛీ.. రీల్స్ కోసం అన్న శవాన్ని వదలని చెల్లెలు!