మెగాస్టార్ చిరంజీవి ఆస్తుల విలువ ఎంతో మీకు తెలుసా?

దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి మెగాస్టార్ చిరంజీవి నంబర్ 1 హీరోగా కొనసాగుతున్నారు.

ప్రస్తుతం చిరంజీవి ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ నటుడిగా, నిర్మాతగా కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే మెగాస్టార్ చిరంజీవి ఆస్తుల విలువ మాత్రం తక్కువ మొత్తమే కావడం గమనార్హం 2009 సంవత్సరంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరపున పాలకొల్లు మరియు తిరుపతి అసెంబ్లీ స్థానాలకు పోటీ చేశారు.

ఆ సమయంలో చిరంజీవి అఫిడవిట్ లో తన పేరుపై 33 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నయని అఫిడవిట్ లో పొందుపరిచారు.

ఈ ఆస్తులలో 30 కోట్ల రూపాయల ఆస్తులు స్థిరాస్తులు అని 3 కోట్ల రూపాయల ఆస్తులు చరాస్తులు అని సమాచారం.

చిరంజీవి ఎన్నికల సమయంలో తన భార్య పేరుపై 6కోట్ల రూపాయల ఆస్తి ఉందని పేర్కొన్నారు.

"""/"/ అయితే మార్కెట్ వాల్యూ ప్రకారం ప్రస్తుతం చిరంజీవి ఆస్తుల విలువ వందల కోట్ల రూపాయలు ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు.

బ్యాక్ గ్రౌండ్ లేకుండా నటుడిగా ఎదిగిన చిరంజీవి తన టాలెంట్ తో ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.

ఎన్నికల సమయంలో 59 లక్షల రూపాయల అప్పు ఉన్నట్టు చిరంజీవి పేర్కొన్నారు.తమిళనాడు రాష్ట్రంలో కూడా ఆస్తులు ఉన్నాయని చిరంజీవి ఆ సమయంలో వెల్లడించారు.

చిరంజీవి కొడుకు రామ్ చరణ్ పలు వ్యాపారాలతో బిజీగా ఉండటంతో పాటు ఆ వ్యాపారాల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు.

చిరంజీవి హీరోగా చరణ్ పలు సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే.ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడంతో పాటు నిర్మాతగా రామ్ చరణ్ కు మంచి లాభాలను మిగల్చడం గమనార్హం.

రెండోసారి తల్లి కాబోతున్న ప్రముఖ నటి ప్రణీత.. ఈ దుస్తులు ఇక సరిపోవంటూ?