మెగాస్టార్ చిరంజీవిని రోజా ఎలా మోసం చేసిందో తెలుసా?
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి తెలుగులో ఎన్నో సంచలన సినిమాలు చేసి టాప్ హీరోగా ఎదిగిన నటుడు.
ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి వెండి తెరను ఏలిన హీరో.అటు తెలుగు తెరపై తన అందచందాలతో కైపెక్కించిన నటి రోజా.
తన అందంతో పాటు నటనతో తెలుగు జనాల్లో చెరగని ముద్రవేసిన నటీమణి.ఈమె తాజాగా చిరంజీవికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించింది.
అదీ తనను మోసం చేసినట్లు చెప్పింది.ఇంతకీ చిరంజీవిని రోజా ఎలా మోసం చేసింది అనేకదా మీ డౌట్.
అయితే ఈ స్టోరీ చూడండి మీకే తెలుస్తుంది.చిరంజీవి, రోజా హీరో, హీరోయిన్లుగా నటించిన ఫస్ట్ మూవీ ముఠా మేస్రీ.
ఈ సినిమా షూటింగ్ లో భాగంగా తొలి రోజే పాటను షూట్ చేయాలని దర్శకుడు భావించాడు.
అయితే ఫస్ట్ డే షూటింగ్‌లో జరిగిన పలు ఆసక్తికర సన్నివేశాలను రోజా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
ముఠామేస్త్రీ సినిమా షూటింగ్ మొత్తంలో జరిగిన మరికొన్ని విషయాలను సైతం వివరించింది.నిజానికి చిరంజీవితో డ్యాన్సులు అంటే మామూలు విషయం కాదు.
ఆయనతో డ్యాన్సులు చేసేందుకు హీరోయిన్లు భయపడేవారు. """/"/
అందుకే ఆయనతో జాగ్రత్తగా ఉండాలని చాలా మంది రోజాకు చెప్పారట.
నిజమేనని రోజా భయపడిందట కూడా.అయితే జనాలు భయట అనుకునేలా చిరంజీవి లేరని చెప్పింది.
చిరంజీవి సెట్స్ కు వచ్చాక రోజాను ప్రేమగా పలకరించాడట. """/"/
తొలి రోజు షూటింగ్ లో భాగంగా ఎంత ఘాటు ప్రేమయో అనే పాట షూటింగ్ మొదలు పెట్టారట.
ఈ సినిమాలోనే మామా మామా అనే మాస్ పాట దుమ్మురేపిన సంగతి తెలిసిందే.
ఆ పాట షూటింగ్ సమయంలో చిరంజీవి హనుమాన్ దీక్షలో ఉన్నారట.అందుకే రొమాంటిక్ స్టెప్పులు వేయడానికి కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాడట.
దాన్ని రోజా అడ్వాంటేజ్ గా తీసుకుని రెచ్చిపోయిందట.చిరంజీవిని మించి డ్యాన్స్ చేసిందట.
రీహార్సల్స్ లో మామూలుగా డ్యాన్స్ చేసి కెమెరా ముందు ఇరగదీసిందట.అక్కడ ఒకలా ఇక్కడ మరోలా .
అర్హ పుట్టినరోజు.. వైరల్ అవుతున్న స్టార్ హీరో అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్!