పుత్రోత్సాహంతో పొంగిపోతున్న మెగాస్టార్.. చరణ్ కు బర్త్ డే విషెష్ అలా చెప్పిన చిరు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఈ రోజు పుట్టిన రోజును జరుపు కుంటున్న విషయం విదితమే.

రెండు మూడు రోజుల ముందునుండే చరణ్ బర్త్ డే (Ram Charan Birthday) సెలెబ్రేషన్స్ ను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ స్టార్ట్ చేసి హంగామా చేస్తున్నారు.

నెట్టింట మెగా ఫ్యాన్స్ చేసిన సందడి అంతా ఇంతా కాదు.ఇక ఫ్యాన్స్ మాత్రమే కాదు తోటి స్టార్స్, ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా చరణ్ కు స్పెషల్ గా విషెష్ చెబుతున్నారు.

మరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కూడా బ్యూటిఫుల్ ఫోటో షేర్ చేస్తూ తన విషెష్ మరింత అందంగా చెప్పుకొచ్చాడు.

ఈయన తన తనయుడు పుట్టిన రోజు నాడు నెట్టింట పోస్ట్ చేయగా అది ఇప్పుడు వైరల్ అవుతుంది.

మెగాస్టార్ పోస్ట్ చేస్తూ.''నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నాన్న.

హ్యాపీ బర్త్ డే అంటూ చెప్పుకొచ్చారు మెగాస్టార్. """/" / అలాగే ఒక బ్యూటిఫుల్ ఫోటో కూడా షేర్ చేసారు.

రామ్ చరణ్ ను ముద్దు పెడుతూ ఉన్న ఫోటో షేర్ చేయగా ఇది అందరిని ఆకట్టు కుంటుంది.

ఇదిలా ఉండగా రామ్ చరణ్ ప్రజెంట్ చేస్తున్న సినిమాల్లో శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఒకటి.

నిన్నటి వరకు RC15 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా టైటిల్ ను ఈ రోజు రివీల్ చేసారు.

"""/" / ఈ పాన్ ఇండియన్ సినిమాకు ''గేమ్ ఛేంజర్'' అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇది పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఈ టైటిల్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది.

ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

చూడాలి ఈ సినిమాతో ట్రిపుల్ ఆర్ విజయాన్ని కంటిన్యూ చేస్తాడో లేదో.

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు 100 సార్లు బ్లడ్ డొనేట్ చేసిన ప్రముఖ నటుడు.. గొప్పోడంటూ?