మెగా 154 ప్రీ లుక్ ఇదుగో.. రేపు రచ్చ ఖాయం
TeluguStop.com
మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తర్వాత వరుసగా సినిమా కమిట్ అయ్యాడు.
ఇప్పటికే మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ ను మొదలు పెట్టారు.లూసీఫర్ మాత్రమే కాకుండా తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం ను కూడా మొదలు పెట్టేందుకు సిద్దంగా ఉన్నారు.
రేపు చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా పెద్ద ఎత్తున అంచనాలున్న వేదాళం సినిమా రీమేక్ కు సంబంధించిన అప్‌డేట్ ను ఇవ్వబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా కు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇదో విభిన్నమైన సినిమా గా ఉంటుందని వేదాళంకు చాలా మార్పులు చేర్పులు చేసి తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఈ సినిమాను మార్చారు అంటూ వార్తలు వస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వేదాళం రీమేక్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రేపు సాయంత్రం 4.
05 కు అందించేందుకు సిద్దం అయ్యారు.మైత్రి మూవీ మేకర్స్ ఈమద్య కాలంలో భారీ అంచనాలున్న సినిమా లను నిర్మిస్తున్నారు.
ఇప్పుడు చిరంజీవితో చేయబోతున్న ఈ సినిమా కూడా మరో లెవల్ లో ఉంటుంది అనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.
వేదాళం రీమేక్ కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించబోతున్నాడు. """/"/ చిరంజీవి సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఇచ్చి కాస్త గ్యాప్ వచ్చింది.
ఈసారి రచ్చ రచ్చ గా ఉంటుందనే నమ్మకం ను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
రేపు చిరు 154 నుండి ఏం రాబోతుంది అనేది అంతా సస్పెన్స్ గా ఉంది.
ఇప్పటి వరకు షూటింగ్ మొదలు పెట్టిన దాఖలాలు లేవు.ఆచార్య మరియు లూసీఫర్ రీమేక్ లతో పాటు సమాంతరంగా వేదాళం రీమేక్ కూడా రెడీ ఫర్ రిలీజ్ అన్నట్లుగా చాల తక్కువ సమయంలో పూర్తి అవ్వబోతుందట.
ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవారు కచ్చితంగా తినాల్సిన పండ్లు ఇవే!