లోకేష్ కి చిరు సిగ్నల్ ఇచ్చాడా..?

ఉలగనాయగన్ కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో వచ్చిన సినిమా విక్రం.

ఈ సినిమా కమల్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

300 కోట్ల గ్రాస్ కలక్షన్స్ తో కమల్ ఈ సినిమాతో భారీగా లాభ పడ్డారు.

సినిమా సెన్సేషనల్ హిట్ అయిన సందర్భంగా డైరక్టర్, అసిస్టంట్ డైరక్టర్స్ ఇంకా చిత్రయూనిట్ కి కమల్ హాసన్ కానుకలు ఇచ్చాడు.

ఇదిలాఉంటే కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ లకు మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమా సక్సెస్ అయినందుకు అభినందనలు తెలియచేశారు.

ఈక్రమంలో డైరక్టర్ లోకేష్ కనగరాజ్ కి మెగాస్టార్ చిరంజీవి నుండి ఆఫర్ వచ్చిందని టాక్.

లోకేష్ కనగరాజ్ తో తన కోసం కూడా ఒక గ్యాంగ్ స్టర్ కథని ఒకటి రెడీ చేయమని చెప్పారట చిరంజీవి.

లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో చిరు సినిమా అంటే మెగా ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ అన్నట్టే లెక్క.

విక్రం తో లోకేష్ కనగరాజ్ క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగింది.విక్రం తర్వాత లోకేష్ కనగరాజ్ మరోసారి దళపతి విజయ్ తో సినిమా చేస్తున్నాడు.

 ఆ సినిమాతో కూడా మరోసారి తన సత్తా చాటాలని ఉన్నాడు లోకేష్ కనగరాజ్.

బౌన్సర్లతో పెళ్లికి హాజరైన పల్లవి ప్రశాంత్… నీ బిల్డప్ చూడలేకపోతున్నాం అంటూ భారీ ట్రోల్స్!