అభిమాని కోసం ముందుకొచ్చిన మెగాస్టార్
TeluguStop.com
అభిమానికి సాయం చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చారు.తన స్వగ్రామమైన మొగల్తూరుకి చెందిన ఓ అభిమానికి రెండు కిడ్నీలు పాడై ఇబ్బందులు పడుతుండటంతో వైద్యం చేపిస్తానని భరోసా ఇచ్చారు.
గోడావారిపేటకు చెందిన కొయ్య నాగరాజు అనే వ్యక్తి చిరుకి అభిమానిగా ఉంటూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాడు.
ఇటీవల రెండు కిడ్నీలు దెబ్బతినడంతో వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించలేదు.దీంతో చిరంజీవిని కలిసి మాట్లాడాలని సోషల్ మీడియాలో కోరాడు.
విషయాన్ని తెలుసుకున్న చిరంజీవి నాగరాజును తన ఇంటికి రావాలని ఆహ్వానించారు.ఈ క్రమంలో హైదరాబాద్ వెళ్లగా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న మెగాస్టార్.
అభిమానికి పూర్తిస్థాయిలో కార్పొరేట్ వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తానని భరోసా ఇచ్చారు.
తమిళం లో ధనుష్ మాదిరిగా తెలుగు హీరోలు ఎందుకు ఉండటం లేదు…