మెహర్ రమేష్ ని బడ్జెట్ కంట్రోల్ పెట్టమన్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేయడానికి దర్శకులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇందులో భాగంగా ప్రస్తుతం ఆచార్య సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు.దీని తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో లూసీఫర్ సినిమా స్టార్ట్ కాబోతుంది.

ఆచార్య, లూసీఫర్ సినిమాలలో చిరంజీవితో పాటు మరో యంగ్ హీరో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.

వీటితో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు.

ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.ఇక ఈ సినిమాని తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు, చేర్పులు చేసి సిద్ధం చేసే పనిలో మెహర్ టీం బిజీగా ఉంది.

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి రూపంలో మెహర్ రమేష్ కి దర్శకత్వం అవకాశం వచ్చింది.

దీనిని ఎలా అయిన ఉపయోగించుకొని సూపర్ హిట్ కొట్టాలని మెహర్ భావిస్తున్నాడు.అయితే ఈ రీమేక్ విషయంలో చిరంజీవి దర్శకుడు మెహర్ రమేష్ కి బడ్జెట్ పరిమితులు ఇచ్చినట్లు తెలుస్తుంది.

మెహర్ రమేష్ అంటే సినిమాలో అనవసరమైన ఖర్చు ఎక్కువ ఉంటుందని టాక్ ఉంది.

శక్తి సినిమా విషయంలో కూడా తెరపై గ్రాండియర్ కోసం నిర్మాత అశ్వినీదత్ తో అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయించినట్లు అప్పట్లో టాక్ నడిచింది.

ఈ నేపధ్యంలో ఈ సారి అలాంటి అవకాశం లేకుండా సినిమాని కేవలం 25 కోట్లలోనే పూర్తి చేయాలని మెహర్ కి చిరంజీవి కండిషన్ పెట్టినట్లు తెలుస్తుంది.

తన రెమ్యునరేషన్ మినహాయించుకొని ఆర్టిస్ట్ ల రెమ్యునరేషన్, సినిమా బడ్జెట్ కలుపుకొని 25 కోట్లు మించకుండా చూసుకోవాలని గట్టిగా చెప్పినట్లు సమాచారం.

దీంతో మెహర్ రమేష్ ఈ సారి అనవసరమైన ఆర్భాటాలు లేకుండా పక్కా ప్లానింగ్ తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడని తెలుస్తుంది.

రజినీకాంత్ ప్లాప్ డైరెక్టర్ల కు ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదా..?