లూసీఫర్‌, వేదాళం రీమేక్‌ ల బడ్జెట్‌ ల విషయంలో చిరంజీవి కండీషన్‌

లూసీఫర్‌, వేదాళం రీమేక్‌ ల బడ్జెట్‌ ల విషయంలో చిరంజీవి కండీషన్‌

మెగా స్టార్‌ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెల్సిందే.కరోనా కారణంగా గత ఏడాది గా ఆలస్యం అవుతున్న ఈ సినిమా ను రెండు మూడు వారాల షూటింగ్ తో గుమ్మడి కాయ కొట్టేయ బోతున్నారు.

లూసీఫర్‌, వేదాళం రీమేక్‌ ల బడ్జెట్‌ ల విషయంలో చిరంజీవి కండీషన్‌

ఆచార్య సినిమా ను ఈ నెలలో విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా సెకండ్‌ వేవ్‌ మొత్తం ప్లాన్‌ ను తలకిందులు చేసింది.

లూసీఫర్‌, వేదాళం రీమేక్‌ ల బడ్జెట్‌ ల విషయంలో చిరంజీవి కండీషన్‌

ఆచార్య సినిమా షూటింగ్ ను ముగించిన వెంటనే లూసీఫర్‌ అదే సమయంలో వేదాళం సినిమా లను పట్టాలెక్కించేందుకు చిరంజీవి ముందస్తుగానే ప్లాన్‌ చేశాడు.

కాని అనూహ్యంగా సినిమా లు రెండు కూడా ఆలస్యం అవుతున్నాయి.వేదాళం సినిమా రీమేక్ కు మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించబోతుండగా లూసీఫర్‌ రీమేక్ కు తమిళ దర్శకుడు మోహన రాజా దర్శకత్వం వహించబోతున్నాడు.

ఈ ఇద్దరు దర్శకులకు బడ్జెట్‌ విషయంలో ముందస్తుగా కండీషన్‌ ను చిరంజీవి పెట్టాడట.

చిరంజీవి ఈ రెండు సినిమాలకు కూడా పారితోషికం కాకుండా లాభాల్లో వాటాను తీసుకోబోతున్నాడు.

వేదాళం మరియు లూసీఫర్‌ రీమేక్ ను చిరంజీవి చేసేందుకు గాను కమిట్‌ అయిన సమయంలో మొదటే బడ్జెట్‌ విషయంలో పరిమితి విధించాడట.

ఈ రెండు సినిమా లు కూడా తన పారితోషికం కాకుండా తక్కువ బడ్జెట్‌ లో పూర్తి చేయాలని భావిస్తున్నారట.

వేదాళం సినిమా ను 20 నుండి 25 కోట్ల లోపు బడ్జెట్‌ తో ఇక లూసీఫర్‌ ను 35 కోట్ల బడ్జెట్‌ తో రూపొందించాలనే నిర్ణయానికి వచ్చారు.

ప్రస్తుతం సినిమా లకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతోంది.స్క్రిప్ట్‌ వర్క్ అంతా పూర్తి చేసిన తర్వాత రెండు సినిమా ల షూటింగ్ లను కాస్త అటు ఇటు తేడాతో మొదలు పెట్టబోతున్నారు.

తక్కువ బడ్జెట్‌ తో నిర్మించడం వల్ల సినిమా ఫలితాలు నిరాశ పర్చినా కూడా లాభాలు దక్కించుకునే అవకాశం ఉంటుంది అనేది చిరంజీవి వ్యూహంగా తెలుస్తోంది.

అందుకే చిరంజీవి బడ్జెట్‌ విషయంలో పరిమితులు విధించాడు.

వీడియో వైరల్.. ఇది ఆటోనా..? లేక నడిచే డిజిటల్ లైబ్రరీనా?

వీడియో వైరల్.. ఇది ఆటోనా..? లేక నడిచే డిజిటల్ లైబ్రరీనా?