Varun Tej: వరుణ్ తేజ్ పెళ్లి కార్డు ఖరీదుతో మధ్య తరగతి వాళ్ళ పెళ్లి చేయొచ్చు.. ఎన్ని లక్షలంటే..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య ( Varun Tej,Lavanya ) లు పెళ్లి దగ్గరికి పడడంతో ఇటలీకి పయనమయ్యారు.

ఇక తాజాగా పవన్ కళ్యాణ్ తన మూడో భార్య అన్నా లెజ్నోవా తన పిల్లలతో కలిసి ఇటలీకి వెళ్లారు.

ఇక మెగా ఫ్యామిలీకి సంబంధించి, అల్లు ఫ్యామిలీకి సంబంధించి ప్రతి ఒక్కరు ఇటలీ కి ప్రయాణమయ్యారు.

కేవలం వరుణ్ తేజ్ నానమ్మ అంజనా దేవి ( Anjana Devi ) మాత్రం ఇక్కడే ఉండిపోయింది.

అయితే నిహారిక పెళ్లి సమయంలో కూడా అంజనాదేవి ఇంటి దగ్గరే ఉండిపోయింది.ఆమె ఆరోగ్యం సహకరించక పోవడంతో ఆమె విదేశాల్లో పెళ్లిళ్లకు వెళ్లడం లేదు.

అయితే తాజాగా వరుణ్ తేజ్ పెళ్లికి సంబంధించిన పెళ్లి కార్డు వ్యాల్యూ ఎంతో తెలుసా అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

"""/"/ అంతేకాదు వరుణ్ తేజ్ పెళ్లి కార్డు ( Varun Tej Wedding Card ) తో ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక కూతురు పెళ్లి చేయొచ్చు అని కూడా ఈ విషయం తెలిసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరి ఇంతకీ ఆ కార్డు వ్యాల్యూ ఎంతో ఇప్పుడు తెలుసుకుందామా.మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి తమ ప్రేమ పెళ్లిని చాలా రహస్యంగా చివరి వరకు మెయింటైన్ చేశారు.

వీరి ఎంగేజ్మెంట్ అయ్యే వరకు కూడా పెళ్లి నిజమే అనే సంగతి ఎవరికీ తెలియదు.

అలా చాలా రహస్యంగా మెయింటైన్ చేసి చివరికి పెళ్లి వరకు వచ్చారు.ఇక ఇప్పటికే పెళ్లి పనులు పూర్తి చేసుకొని ఇటలీ ( Italy ) కూడా ప్రయాణమయ్యారు.

వీరి పెళ్లి నవంబర్ 1న గ్రాండ్ గా జరగబోతుంది.అయితే వరుణ్ తేజ్ ఇప్పటికే చాలామందికి పెళ్లి కార్డ్స్ పంచారు.

ఇక వరుణ్ తేజ్ పెళ్లి కార్డు చాలా స్పెషల్ గా అందర్నీ అట్రాక్ట్ చేసే విధంగా ఉంది.

"""/"/ ఇక ఆ పెళ్లి కార్డులో కూడా వరుణ్ తేజ్ కుటుంబ సభ్యులందరినీ కవర్ చేశారు.

ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ తన పెళ్లి కార్డు ఏకంగా 6 లక్షలు పెట్టి డిజైన్ చేయించారు అని తెలుస్తోంది.

ఇక ఒక పెళ్లి కార్డు కే 6 లక్షలు( Lavanya Varun Tej Wedding Card Price ) అంటే ఇది మామూలు విషయం కాదు.

ఇక వీరికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ లావణ్య త్రిపాఠి ( Lavanya Tripathi ) తన సోషల్ మీడియా ఖాతాలో కూడా షేర్ చేసింది.

అయితే ఒక పెళ్లి కార్డు విలువనే ఆరు లక్షలు అంటే వీరు పెళ్లికి ఇంకా ఏ రేంజ్ లో ఖర్చు పెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఇక వరుణ్ తేజ్ తన పెళ్లి కార్డుకు ఖర్చు పెట్టిన ఆరు లక్షలతో ఒక మధ్య తరగతి కుటుంబంలో పెళ్లి చేయవచ్చు అని చాలామంది నెటిజన్ లు ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు.

చెత్త కుప్పలో కట్టలు కట్టలుగా నోట్ల కట్టలు.. అవి దొరికిన పిల్లలు..?