మెగా నందమూరి హీరోలు ఒకే సినిమాలో.. బావ బామ్మర్ది పాత్రల్లో?

తెలుగు సినీ ప్రేక్షకులకు మెగా ఫ్యామిలీ గురించి, నందమూరి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఈ రెండు కుటుంబాలకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

ఇక ఈ రెండు కుటుంబాల హీరోల నుంచి వచ్చే సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ లు అవుతూ ఉంటాయి.

అయితే ఈ హీరోల సినిమాలు విడివిడిగా వస్తేనే సినిమా హిట్ అవుతుంది అంటే ఇక రెండు ఫ్యామిలీ హీరోలు కలిసి చేస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఖాయం.

కాగా ఇటీవలె మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ నందమూరి ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ లు ఆర్ఆర్ఆర్ సినిమాలో కలిసిన నటించిన విషయం తెలిసిందే.

వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

కాగా ఈ సినిమా విడుదల అయ్యి కొన్ని నెలలు అవుతున్న ఇప్పటికీ రికార్డులను సృష్టిస్తూనే ఉంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ రెండు కుటుంబాలకు సంబంధించిన ఒక వార్త చక్కర్లు కొడుతుంది.

అదేమిటంటే నందమూరి హీరో మెగా హీరో కాంబినేషన్ లో మరొక సినిమా రాబోతోందట.

ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ 30 వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

కాగా దర్శకుడు కొరటాల శివ తరకెక్కించిన ఆచార్య సినిమా భారీగా ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే.

అయితే కొరటాల శివ ఆచార్య సినిమా ఆర్థిక ఇబ్బందుల నుంచి ఇంకా బయటపడలేదు.

"""/" / ఇంకా తాజాగా ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న కొరటాల శివ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా చాలా సమయం పడుతుందట.

వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుందట.

అయితే ఎన్టీఆర్ సినిమాలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా నటించబోతున్నారట.అందులో జూనియర్ ఎన్టీఆర్ బామర్దిగా సాయి ధరమ్ తేజ్ పాత్ర ఉండబోతుందట.

అంతేకాకుండా సాయి ధరమ్ తేజ్ పాత్రకు కూడా హీరోయిన్ ఉందట.సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్త కనుక నిజమైతే మెగా అభిమానులకు నందమూరి అభిమానులకు మరొకసారి మంచి ఎంటర్టైన్మెంట్ దొరికినట్టే అని చెప్పవచ్చు.

అయితే మెగా అభిమానులు నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్త నిజమైతే బాగుండు అని కోరుకుంటున్నారు.

మరి ఈ వార్తలు నిజా నిజాలు తెలియాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే మరి.

ఎమ్మెల్యే కొడుకుతో పెళ్లి కోసం మతం మార్చుకున్న ప్రముఖ హీరోయిన్.. అసలేం జరిగిందంటే?