జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా :డ్రగ్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దేందుకు విలాసాలకు అలవాటైన యువత దృష్టి మళ్లించేందుకు విన్నూత కార్యక్రమాలు చేపడుతున్నామని అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ నెల 13-06-2024 రోజున సిరిసిల్ల పట్టణ పరిధిలోని కల్యాణ లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో సుమారు 60 కి పైగా కంపెనీల సహాయంతో 1000 పైగా ఉద్యోగ అవకాశాలతో మెగా జాబ్ మేళా( Mega Job Mela ) నిర్వహిస్తున్నామని, జిల్లాలోని 10త్ , ఇంటర్ , ఎనీ అబోవ్ డిగ్రీ , బి .
టెక్ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతి యువకులు క్రింద ఇవ్వబడిన లింక్ Https://me-qr!--com/z0s8PfJt లో పెరు నమోదు చేసుకోవాలని తెలిపారు.
జిల్లాలోని నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు అందిపుచుకోవడానికి ఇది ఇక సువర్ణావకాశం అని ఎస్పీ తెలిపారు.
అనంతరం జాబ్ మేళ కి సంబంధించిన పోస్టర్ ని అధికరులతో కలసి ఆవిష్కరించారు.
షాకింగ్ వీడియో: కదులుతున్న రైలులో రీల్ చేస్తూ చెట్టుకు ఢీకొన్న యువతీ.. చివరకు ఏమైందంటే?