Mega Heros Movies: 2023లో మెగా హీరోలకు ఇన్ని షాకులు తగిలాయా.. ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయంటే?

మామూలుగా ఏడాదికి ఎన్నో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి.అందులో కొన్ని సూపర్ హిట్ మరి కొన్ని బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిస్తే ఇంకొన్ని ఘోరమైన డిజాస్టర్ ను చవిచూస్తూ ఉంటాయి.

అలా ఈ ఏడాది అనగా 2023 కూడా మెగా హీరోలకు( Mega Heros ) ఊహించని షాక్ ఇచ్చింది.

ఈడాది మెగా హీరోలకు అంతగా కలిసి రాలేదనే చెప్పవచ్చు.ఎందుకంటే మెగా హీరోలు నటించిన చాలా సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి.

ఆ వివరాల్లోకి వెళితే.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కమ్ బ్యాక్ తర్వాత వరుసగా మూడు రీమేక్స్ చేశారు.

బ్రో సినిమా( Bro Movie ) షూటింగ్ అయితే 20 రోజుల్లో పూర్తి చేశారు.

పవన్ కళ్యాణ్ ఉంటే చాలు సినిమా ఆడేస్తుందన్నట్లు చకచకా పూర్తి చేసి థియేటర్స్ లోకి వదిలారు.

బ్రో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి సెట్ అయ్యే కథ కాదు.త్రివిక్రమ్ అసలు కథకు అవసరం లేని హంగులు దిద్ది ఆత్మను చంపేశారు.

దాంతో వినోదాయ సీతం ఫ్లేవర్ బ్రోలో మిస్ అయ్యింది.సినిమా ఎమోషనల్ గా కనెక్ట్ కాలేదు.

దాంతో బ్రో నష్టాలు మిగిల్చింది.విరూపాక్ష సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సాయి ధరమ్ తేజ్ కి( Sai Dharam Tej ) ఈ మూవీ చేదు అనుభవం మిగిల్చింది.

దానికి తోడు రాజకీయ వివాదాలు రాజేసింది.బ్రో చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

హీరో రవితేజకు 2023 మిక్స్డ్ ఫలితాలు ఇచ్చింది. """/" / ఆయన నటించిన వాల్తేరు వీరయ్య( Waltair Veerayya ) బ్లాక్ బస్టర్ కొట్టింది.

మెయిన్ లీడ్ చిరంజీవి( Chiranjeevi ) అయినప్పటికీ రవితేజ పాత్రకు చాలా వెయిట్ ఇచ్చారు.

అయితే రావణాసురతో రవితేజ దెబ్బైపోయాడు.అలాగే భోళా శంకర్ మూవీతో( Bhola Shankar Movie ) చిరంజీవి భారీ డిజాస్టర్ ఖాతాలో వేసుకున్నారు.

వాల్తేరు వీరయ్య మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన చిరంజీవికి భోళా శంకర్ పెద్ద షాక్ ఇచ్చింది.

భోళా శంకర్ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.2015లో విడుదలైన వేదాళం చిత్రానికి భోళా శంకర్ అధికారిక రీమేక్.

"""/" / ఈ మూవీ చేసినందుకు చిరంజీవి అభిమానులు కూడా నొచ్చుకున్నారు.రీమేక్స్ చేయకండి అన్నయ్య అంటూ సలహాలు ఇచ్చారు.

భోళా శంకర్ ఫలితం తర్వాత చిరంజీవి మనసు మార్చుకున్నారు.లైన్లో పెట్టిన ఒక మలయాళ రీమేక్ ని సైడ్ చేశాడు.

2023లో హైప్ మధ్య విడుదలైన ఈ రీమేక్స్ పరాజయం పాలయ్యాయి.అలాగే హీరో వైష్ణవ్ తేజ్( Vaishnav Tej ) నటించిన ఆదికేశవ సినిమా( Adikeshava Movie ) కూడా విడుదల ఊహించిన విధంగా దారుణమైన ఫలితాలను చవి చూసింది.

ఇలా 2023 మెగా హీరోలకు చేదు అనుభవాలనే మిగిలింది.మరి 2024 లో అయినా సరైన హిట్ సినిమాలను అందుకుంటారో లేదో చూడాలి మరి.

మహేష్ నా చిన్న తమ్ముడు… పవన్ అందుకే మా ఇంటికి వచ్చేవాడు: వెంకటేష్