Chiranjeevi Allu Arjun : ఒకే ప్రేమ్ లో మెగా హీరోలు… రెండు కళ్ళు సరిపోవట్లేదు భయ్యా… ఫోటో వైరల్!

మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం ఇటలీలో వరుణ్ తేజ్ ( Varun Tej ) లావణ్య త్రిపాఠి ( Lavanya Tripati ) పెళ్లి వేడుకలలో ఉన్న సంగతి మనకు తెలిసిందే.

నాగబాబు కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాటి ప్రేమలో ఉంటూ ఇన్ని రోజులు తమ ప్రేమ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు.

ఇలా ఇన్ని రోజులు పాటు ప్రేమలో మునిగి తేలుతున్నటువంటి ఈ జంట ఎట్టకేలకు పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు.

నవంబర్ ఒకటవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మూడుముళ్ల బంధంతో వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.

"""/" / ఇక వీరి వివాహం ఇటలీలో కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో మాత్రమే జరిగిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే మూడు రోజులపాటు ఎంతో అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఈ పెళ్లి వేడుకకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలా సంగీత్ మెహందీ హల్ది వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఈ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు.

ఇక తాజాగా వరుణ్ తేజ్ పెళ్లి ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

"""/" / గోల్డ్ కలర్ శార్వాణిలో వరుణ్ తేజ్ మెరూన్ రెడ్ కలర్ కంచి పట్టు శారీలో లావణ్య త్రిపాఠి ఎంతో అందంగా ఉన్నటువంటి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే తాజాగా మెగా హీరోలు అందరూ కలిసి ఒకే ప్రేమ్ లో ఉన్నటువంటి ఫోటోని మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi )సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది.

ఇందులో వధూవరులు కూర్చుని ఉండగా మెగా హీరోలు అందరూ కూడా వారి వెనుక నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు.

ఈ ఫోటోలలో మెగా హీరోలు అందరూ కూడా ఒకే ప్రేమ్ లో కనిపించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

"""/" / ఇలా చిరంజీవి షేర్ చేసిన ఈ ఫోటోలలో పవన్ కళ్యాణ్ చాలా సింపుల్గా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

ఈ పెళ్లి ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇన్ని రోజులపాటు మెగా అల్లు కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఉన్నాయి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

అయితే ఆ వార్తలన్నీ పూర్తిగా ఆ వాస్తవమని ఈ ఒక్క ఫోటో ద్వారా స్పష్టమవుతుంది.

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలలో భాగంగా మెగా హీరోలు అందరూ కూడా ఒకే ప్రేమలో కనిపించడంతో ఈ ఫోటోని అభిమానులు మరింత వైరల్ చేస్తున్నారు.

ఇక వరుణ్ పెళ్లి వేడుకలలో భాగంగా కొద్దిరోజుల పాటు తమ సినిమా షూటింగులకు బ్రేక్ ఇచ్చినటువంటి ఈ హీరోలు పెళ్లి వేడుకలలో పాల్గొన్నారు.

నవంబర్ 5వ తేదీ హైదరాబాదులో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ పూర్తి కాగానే తిరిగి తమ సినిమా షూటింగ్ పనులలో మెగా హీరోలందరూ బిజీ కానున్నారని తెలుస్తోంది.

ఇక ఈ ఫోటో వైరల్ కావడంతో ఎంతోమంది వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

శ్రీ విష్ణు చేసిన స్వాగ్ సినిమా హిట్టా.? ఫట్టా.?