మెగా హీరోలకు ఇది పెద్ద టాస్క్..!

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా వేదాళం రీమేక్ మూవీ ఎనౌన్స్ మెంట్ వచ్చింది.

మెహర్ రమేష్ డైరక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో చిరు చెల్లి పాత్రలో మహానటి కీర్తి సురేష్ నటిస్తుంది.

రాఖీ పండుగ సందర్భంగా చిరంజీవి, కీర్తి సురేష్ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.

ఇదిలాఉంటే స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ చేస్తున్న ఈ పాత్రపై కొందరు ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.

చిరంజీవికి చెల్లిగా చేస్తున్న కీర్తి సురేష్ ఆ తర్వాత మెగా హీరోల సినిమాల్లో హీరోయిన్ గా ఎలా చేస్తుందని పాయింట్ లేవనెత్తుతున్నారు.

అదేంటి ఆమె చేసేది సినిమాలో ఒక పాత్ర మాత్రమే కదా అని కొందరు సర్ధిచెబుతున్నారు.

అలా అనుకుంటే చరణ్ తో మగధీర, నాయక్ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన కాజల్ చిరుతో ఖైది నెంబర్ 150 లో జోడీ కట్టింది.

హీరోయిన్స్ అన్న తర్వాత ఇలాంటి పట్టింపులు ఉండకూడదని అంటున్నారు.అయితే హీరోయిన్ గా ఓకే కాని కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లిగా నటిస్తుంది కాబట్టి ఆ తర్వాత ఆమెతో మెగా హీరోలు ఎలా జత కడతారని డిస్కషన్స్ చేస్తున్నారు.

ఏది ఏమైనా మెగా హీరోలకు ఇదో పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు.కీర్తి సురేష్ కూడా చిరు చెల్లిగా నటించడం పెద్ద సాహసమే అని చెప్పాలి.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?