మెగా హీరో వరుణ్ తేజ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
TeluguStop.com
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి మంచి నటనతో సత్తా చాటుతున్న హీరో వరుణ్ తేజ్.
ఈయన గురించి జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ప్రముఖ నటుడు, నిర్మాత నాగ బాబు, పద్మజ ముద్దల కొడుకు వరుణ్ తేజ్.
1990లో పుట్టిన ఈ అబ్బాయిని అందరూ ముద్దుగా విషూ అని పిలుస్తారు.ఆరున్న అడుగుల ఈ మెగా హీరో హైదరాబాద్ యూసుఫ్ గూడలోని సెయింట్ మేరీస్ కాలేజ్ లో బీకాం పూర్తి చేశాడు.
సినిమాల మీద ఇష్టంతో చదువును మధ్యలోనే ఆపేశాడు.అనతరం ముకుంద సినిమాతో హీరోగా తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు.
అయితే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు.కలెక్షన్స్ సైతం పెద్దగా రాలేదు.
కానీ.నటన పరంగా వరుణ్ కు మంచి మార్కులు పడ్డాయి.
మంచి పేరు వచ్చింది.అయితే ఈ సినిమాకు గాను ఆయన రూ.
74 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడట.ఈ సినిమా తర్వాత వరుణ్ చాలా సినిమాల్లో నటించాడు.
"""/"/ మిస్టర్, కంచె,లోఫర్, అంతరిక్షం, ఫిదా, గద్దల కొండ గణేష్, ఎఫ్ 2 సినిమాల్లో నటించాడు.
ఇందులో కొన్ని విజయం సాధిస్తే.మరికొన్ని డిజాస్టర్లుగా మిగిలాయి.
అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా వరుణ్ వరసగా సినిమాలు చేస్తున్నాడు.కథ నచ్చితే ఓకే చెప్తున్నాడు.
అటు వరుణ్ వ్యక్తిగత విషయానికి వస్తే ఆయనకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టంమట.
ఇతడి సొంత సంపాదనతో నాలుగు కార్లు, గాయత్రి హిల్ లో ఓ గెస్ట్ హౌస్ కొనుక్కున్నాడట.
ప్రస్తుతం వరుణ్ మణికొండలోని విల్లాలో ఉంటున్నాడు. """/"/ అయితే ఈ విల్లా ఖరీదు సుమారు రూ.
9 కోట్లు ఉంటుందట.అటు ప్రస్తుతం వరుణ్ వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు.
ఈ ఏడాది పలు సినిమాల్లలో నటిస్తున్నాడు.కిరణ్ కొర్రపాటటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గని సినిమాతో పాటు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలోని ఎఫ్-3 సినిమా చేస్తున్నాడు.మరికొన్ని సినిమాలసై చర్చలు జరుగుతున్నాయి.
గేమ్ ఛేంజర్ సినిమాకు భారీ షాక్.. హిట్ టాక్ వచ్చినా ఆ రేంజ్ కలెక్షన్లు కష్టమేనా?