40 కోట్ల బడ్జెట్ పెడితే రూ.2 కోట్ల కలెక్షన్లు.. వరుణ్ తేజ్ జాగ్రత్త పడాల్సిందేనా?
TeluguStop.com
మెగా హీరో వరుణ్ తేజ్ (mega Hero Varun Tej)కు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో క్రేజ్ ఉంది.
తొలిప్రేమ, ఫిదా (Toliprema , Fidaa )సినిమాలలో వరుణ్ తేజ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
ఈ సినిమాలలో వరుణ్ పర్ఫామెన్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.అయితే వరుణ్ తేజ్ తాజా మూవీ మట్కా (Matka)సినిమా కోసం ఏకంగా 40 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా కేవలం 2 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయని సమాచారం అందుతోంది.
మెగా హీరోలకు ఈ సంవత్సరం ఆశించిన స్థాయిలో కలిసిరాలేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
మట్కా సినిమా కలెక్షన్లు చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం షాకవుతున్నాయి.మట్కా సినిమా ఫలితం వరుణ్ తేజ్ (Varun Tej)తర్వాత సినిమాలపై కూడా ప్రభావం చూపిందని తెలుస్తోంది.
వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిందనే సంగతి తెలిసిందే.
"""/" /
అయితే ఈ సినిమాకు ఆదిలోనే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది.
ఈ సినిమాకు భారీ స్థాయిలో ఖర్చు చేయడానికి నిర్మాతలు సాహసిస్తారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
వరుణ్ తేజ్ కు క్రేజ్ భారీ స్థాయిలోనే ఉన్నా సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మాత్రమే వరుణ్ తేజ్ మార్కెట్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
"""/" /
వరుణ్ తేజ్ కు హిట్ ఇచ్చే స్టార్ డైరెక్టర్ ఎవరనే చర్చ కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.
వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
వరుణ్ తేజ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం.
వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యక్ సినిమాలతో కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంది.
ట్రంప్ దెబ్బకి అమెరికాలో భారీగా పెరుగుతున్న సిజేరియన్లు.. భారతీయ తల్లులు పరుగులెందుకు?