మొదలైన మెగా 'రంగరంగ వైభవంగా' సందడి
TeluguStop.com
మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా తో ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
ఆ వెంటనే కొండ పొలం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చినా కూడా టాక్ పరంగా మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది.
అంత తక్కువ కెరీర్ సమయంలోనే అలాంటి పాత్రను చేసేందుకు కమిట్ అవ్వడం నిజంగా అభినందనీయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం రంగ రంగ వైభవంగా సినిమా తో వైష్ణవ్ తేజ్ వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.
అర్జున్ రెడ్డి సినిమా కు సహాయ దర్శకుడిగా చేసిన గిరీశయ్య ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
తమిళ అర్జున్ రెడ్డి సినిమా తో గిరీశయ్య దర్శకుడిగా పరిచయం అయ్యాడు.ఈ సినిమా ఆయనకు మొదటి తెలుగు సినిమా.
రంగ రంగ వైభవంగా టైటిల్ లోనే సినిమా ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేశారు.
తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా విడుదలకు సిద్ధం అయ్యి చాలా రోజులు అవుతుంది.
కానీ వరుసగా ఇతర సినిమాల విడుదల తేదీలు ఉన్న కారణంగా ఈ సినిమా ను సెప్టెంబర్ 2వ తారీకున విడుదల చేసేందుకు నిర్ణయించారు.
ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న ఈ చిత్ర యూనిట్ సభ్యులు విడుదల తేదీ దగ్గర పడ్డ నేపథ్యంలో హడావుడి మొదలు పెట్టారు.
నేడు సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు.నేటి నుండి వరుసగా ప్రెస్ మీట్ లు.
ఇంటర్వ్యూలు మరియు ఈవెంట్స్ తో సినిమా కు విపరీతమైన బజ్ క్రియేట్ చేయాలని భావిస్తున్నారు.
ఈ సినిమా లో హీరోయిన్ గా కేతిక శర్మ నటిస్తున్న విషయం తెల్సిందే.
ఈ సినిమా వైష్ణవ్ తేజ్ కు కమర్షియల్ గా మంచి సక్సెస్ గా నిలుస్తుందేమో చూడాలి.
ఆ అరుదైన ఘనతను స్టార్ హీరో ప్రభాస్ సాధిస్తారా.. ది రాజాసాబ్ తో కల నెరవేరుతుందా?