మెగా ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌.. వైష్ణవ్ తేజ్ 4వ సినిమా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

మెగా ఫ్యామిలీ నుండి ఉప్పెన సినిమా తో ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ తేజ్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ దక్కించుకొని ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ క్లబ్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే.

ఉప్పెన సినిమా తర్వాత వైష్ణవ్‌ తేదీ నటించిన కొండ పొలం మరియు రంగ రంగ వైభవంగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి.

ముఖ్యంగా రంగ రంగ వైభవంగా సినిమా తప్పకుండా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది అంటూ అంత భావించారు.

కానీ ఆ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేదు.ఇక కొండ పొలం సినిమా ముందు నుండే ఒక నాన్ కమర్షియల్ సినిమా అన్నట్లుగా ప్రచారం జరిగింది.

అందుకే ఆ సినిమా వసూళ్ల విషయంలో వెనుకబడి పోయింది.ఇప్పుడు వైష్ణవ తేజ్ నాల్గవ సినిమా కి సమయం వచ్చింది.

ఆయన ఏ దర్శకుడితో ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు అంటూ ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది.

"""/"/ నిన్న మొన్నటి వరకు ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు తోనే వైష్ణవ్‌ తేజ్ నాలుగో సినిమా ఉంటుందంటూ ప్రచారం జరిగింది.

కానీ వైష్ణవ తేజ్ సినిమా కంటే ముందు బుచ్చిబాబుకి ఎన్టీఆర్ నుండి పిలుపు వచ్చింది అంటూ సమాచారం అందుతోంది.

ఎన్టీఆర్ 30 విషయంలో కాస్త గందరగోళం నెలకొంది.ఆ సినిమా కి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తాడు అనే ప్రచారం జరుగుతుంది.

ఈ నేపథ్యంలో వైష్ణవ తేజ్ నాలుగో సినిమా బుచ్చిబాబుతో కాదని క్లారిటీ వచ్చేసింది.

దాంతో మరో దర్శకుడిని వైష్ణవి తేజ్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.కథ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలంటూ మెగా అభిమానులు సూచిస్తున్నారు.

సొంత నిర్ణయం కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ యొక్క నిర్ణయంతో తన నాలుగవ సినిమాకు కమిట్ అయితే తప్పకుండా మంచి ఫలితం వస్తుంది అంటూ మెగా అభిమానుల నుండి వైష్ణవ తేజ్ కి సలహాలు వస్తున్నాయి.

ఒక వైపు అన్నయ్య సాయి ధరమ్ తేజ్ విభిన్నమైన మాస్ సినిమాలు చేస్తుండగా.

వైష్ణవ తేజ్ మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు చేయాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు.

వైష్ణవ్‌ తేజ్‌ నాలుగో సినిమా ఈ ఏడాది చివరి వరకు అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.