ఆ సీన్ కోసం 20 టేకులు తీసుకున్న మెగా హీరో..!
TeluguStop.com
మెగా హీరో వైష్ణవ్ తేజ్ త్వరలో తన మూడవ సినిమా రంగ రంగ వైభవంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
సెప్టెంబర్ 2న రాబోతున్న ఈ సినిమాలో కెతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అలితో సరదాగా షోలో పాల్గొన్నాడు వైష్ణవ్ తేజ్.
ఈ ఇంటర్వ్యూలో ఉప్పెన సినిమాలో ఓ సీన్ కోసం 20 టేకుల దాకా తీసుకున్న విషయాన్ని చెప్పుకొచ్చాడు వైష్ణవ్ తేజ్.
ఆ సీన్ లో హీరోయిన్ మెడ్ మీద కత్తి పెట్టి ఎమోషనల్ గా డైలాగ్ చెప్పాల్సి ఉందని.
ఆ సీన్ కోసం తాను 20 టేకుల తీసుకున్నందుకు వైష్ణవ్ తేజ్ కళ్ల నీళ్లు పెట్టుకున్నాడట.
అప్పుడు కానీ ఆ సీన్ పర్ఫెక్ట్ గా వచ్చిందని అని చెప్పాడు.ఉప్పెన కోసం అంత కష్టపడ్డాడు కాబట్టి సినిమా సూపర్ హిట్ కొట్టాడు.
ఆ సినిమాతో కృతి శెట్టి కూడా స్టార్ క్రేజ్ తెచ్చుకుంది.ఉప్పెన తర్వాత కొండపొలం చేసినా అది వర్క్ అవుట్ కాలేదు.
అయితే మూడవ సినిమా రంగ రంగ వైభవంగా సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు వైష్ణవ్ తేజ్.
రామ్ చరణ్ కెరియర్ మీద భారీ దెబ్బ కొట్టిన శంకర్…