ఈ సమయంలో ఇలాంటి సాహసాలు అవసరమా మేడం గారు?

మెగా స్టార్‌ చిరంజీవి కోడలు.మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌( Ram Charan ) భార్య అయిన ఉపాసన( Upasana ) ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెల్సిందే.

తెలుగు ప్రేక్షకులు అంతా కూడా చిరంజీవి తాత కాబోతున్నాడు అనే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఉపాసన ఎప్పుడెప్పుడు తల్లి అవుతుంది.ఆమె మెగా ఫ్యామిలీకి వారసుడిని ఎప్పుడు ఇస్తుంది అంటూ ఎదురు చూస్తున్నారు.

ఈ సమయంలో ఉపాసన విదేశీ పర్యటనలు.సాహస యాత్రలు కొందరు మెగా ఫ్యాన్స్ కి మింగుడు పడటం లేదు.

ప్రస్తుతం రామ్‌ చరణ్ తో కలిసి ఉపాసన హాలీడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తోంది.

అందులో భాగంగా ఒక స్పీడ్‌ బోట్‌ లో రామ్‌ చరణ్ తో కలిసి ఉపాసన సాహస యాత్ర చేసింది.

సాధారణంగా గర్భంతో ఉన్న వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అంటారు.అడుగు తీసి అడుగు పెట్టాలన్నా కూడా జాగ్రత్తగా ఉండాలి.

అలాంటిది ఉపాసన ఏకంగా సాహస యాత్రలు చేయడం.స్పీడ్ బోట్‌ లో పర్యటనలు చేయడం వంటిది చేయడం ద్వారా ప్రమాదాన్ని కొని తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"""/" / సోషల్‌ మీడియాలో ఉపాసనకు కొందరు మద్దతుగా నిలుస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఆమె తీరును తప్పుబడుతున్నారు.

ఉపాసన కామినేని హాస్పిటల్స్ మరియు అపోలో హాస్పిటల్స్ అధినేత్రి.ఆమెకు వైధ్యం గురించి.

గర్భంతో ఉన్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అస్సలు ఎవరు చెప్పనక్కర్లేదు.ఎంతో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకునే ఉపాసన అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత సాహస యాత్రలు అయినా.

స్పీడ్‌ బోట్‌ ప్రయాణం అయినా చేస్తుంది అనడంలో సందేహం లేదు.కనుక మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందనక్కర్లేదు.

మెగా ఫ్యాన్స్ కోరుకునే విధంగా త్వరలోనే మేడం ఉపాసన బుల్లి రామ్ చరణ్ ను అందించబోతున్నారు.

నాకెప్పుడూ చరణ్ సత్తా మీద డౌట్ లేదు.. రాజమౌళి సంచలన వ్యాఖ్యలు వైరల్!