సంపత్ నంది మీద మాకు నమ్మకం లేదు అంటున్న మెగా ఫ్యాన్స్…. మ్యాటరెంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా మేనల్లుడుగా ఇండస్ట్రీకి ఎంటర్ ఇచ్చిన సాయిధరమ్ తేజ్( Saidharam Tej ) ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్ లో గాంజా శంకర్( Ganja Shankar ) అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా కొంతవరకు షూటింగ్ పూర్తి చేసుకుంది అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ అమెరికాలో స్టార్ట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాతో ఒక మాస్ ఇమేజ్ ని సంపాదించుకోవాలని సాయి ధరమ్ తేజ్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

"""/" / ఇక ఇంతకు ముందు విరూపాక్ష సినిమాతో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చేసి తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు.

ఇక ఇప్పుడు ఈ సినిమాతో మాస్ హీరో గా తనని తాను మరోసారి ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.

అయితే ఈ సినిమా తో సక్సెస్ కనక కొట్టినట్టు అయితే ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరో గా ముందుకు దూసుకెళ్తాడు.

అలాగే సంపత్ నంది ( Sampath Nandi )కూడా ఇప్పటి వరకు అన్ని అవరేజ్ సినిమాలే తీశాడు కాబట్టి ఈ సినిమాతో సక్సెస్ కనక సాధించినట్టు అయితే తను మంచి డైరెక్టర్ గా ముందుకు దూసుకెళ్తాడు.

మరి ఇలాంటి క్రమంలో వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇదిలా ఉంటే ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మీద కొంతవరకైతే అంచనాలు ఉన్నాయి.

"""/" / సంపత్ నంది మీద ప్రేక్షకులకు అంచనాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి.

ఎందుకంటే ఆయన ఇంతకుముందు రామ్ చరణ్ తో రచ్చ సినిమా చేసినప్పుడే ఆ సినిమాతో ప్రూవ్ చేసుకోవాల్సింది కానీ ఆయన మాత్రం ప్రూవ్ చేసుకోలేకపోయాడు.

దాంతో మెగా అభిమానులకి ఆయన మీద పెద్దగా నమ్మకం అయితే లేదు మరీ ఈ సినిమా తో ఏమైనా మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.

కెనడాలో రెచ్చిపోయిన ఖలిస్తాన్‌ మద్ధతుదారులు.. భారత సంతతి మీడియా ప్రతినిధిపై దాడి