ఆ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్.. మరి వారి కోరిక తీరేనా?
TeluguStop.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 'RC15'.
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు తన బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
శంకర్ ఎన్నో రోజులుగా తన ఫామ్ కోల్పోయి ఉన్నాడు.మరి అలాంటి శంకర్ తో రామ్ చరణ్ కాంబో ఖాయం అవ్వడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు.
అయితే శంకర్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాతో రామ్ చరణ్ కు హిట్ అందివ్వడమే కాకుండా ఆయన కూడా కోల్పోయిన తన ఫామ్ ను తిరిగి దక్కించు కుంటాడు అని అంతా భావిస్తున్నారు.
అందుకే ఈ సినిమాపై హోప్స్ అయితే భారీగానే పెట్టుకున్నారు. """/" /
ఇటీవలే రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా లోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ (OSCARS 2023) రావడంతో ఇప్పుడు చరణ్ మీదనే అందరి సృష్టి పడింది.
అంతేకాదు ఈ సినిమాతో ఈయన స్థాయి బాగా పెరిగింది అనే చెప్పాలి.ఈ అవార్డుతో క్రేజ్ పెరగడంతో తన నెక్స్ట్ సినిమా కోసం గ్లోబల్ వైడ్ గా అంతా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో చరణ్ ను శంకర్ కొత్తగా స్టైలిష్ లుక్స్ లో చూపించ బోతున్నారు.
"""/" /
ఈయన లుక్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని.ఒకటి గ్రామీణ యువకుడి పాత్ర అయితే మరోటి సూపర్ స్టైలిష్ పాత్ర అని తెలుస్తుంది.
బాలీవుడ్ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ ఈయన కోసం పని చేస్తున్నాడు.ఇలా ఈ సినిమా మీద మెగా ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకుని ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
ఇక ఇదే నెలలో చరణ్ పుట్టినరోజు (Ram Charan Birth Day) కానుకగా మార్చి 27న మాసివ్ అప్డేట్ అయితే ఉందని అంటున్నారు.
చూడాలి మెగా ఫ్యాన్స్ ను ఎలా మెప్పిస్తాడో.
నెయ్యితో ఆరోగ్యాన్నే కాదు అందాన్ని కూడా పెంచుకోండిలా!