మెగా హీరోల మద్యలో పవన్‌ కొడుకు కూడా ఉన్నాడే

ఈ ఫొటో ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్‌కు కన్నుల పండుగ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎందుకంటే ఈ ఫొటోలో మొత్తం మెగా ఫ్యామిలీ ఉన్నారు.చిరంజీవితో మొదలుకుని పవన్‌ కళ్యాణ్‌ తనయుడు అకీరా వరకు అంతా ఉన్నారు.

మామూలుగా అయితే పవన్‌ కళ్యాణ్‌ తనయుడు అకీరా మెగా ఫ్యామిలీతో చాలా అరుదుగా మాత్రమే కలుస్తూ ఉంటాడు.

చిరంజీవి ప్రత్యేకంగా ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే తప్పకుండా మెగా ఫ్యామిలీ హీరోలు అంతా ఒక్క చోట చేరుతారు.

"""/" /తాజాగా సంక్రాంతి సందర్బంగా మెగాస్టార్‌ చిరంజీవి తన కుటుంబ సభ్యులందరిని కూడా ఒక్క చోట చేర్చారు.

సంవత్సరంలో ఏదో ఒక రోజున అంతా కూడా గెట్‌ టు గెదర్‌ అవ్వాలనేది మెగాస్టార్‌ సూచన.

ఆమేరకు ఈ సంక్రాంతికి మెగా ఫ్యామిలీ అంతా కలిశారు.మెగాస్టార్‌ సమక్షంలో జరిగిన సంక్రాంతి వేడుకలో అంతా కూడా సరదాగా గడిపారు.

ఈ సందర్బంగా తీసుకున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. """/" /పెద్ద ఎత్తున సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు అంటూ మెగా ఫ్యాన్స్‌ ఫొటోలను చూస్తూ సంభ్రమాశ్చర్యాలకు గురి అవుతున్నారు.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ కొడుకు అకీరా ఈ కుటుంబంలో కలవడం చాలా మందికి సంతోషాన్ని కలిగిస్తున్నాయి.

అందరు కూడా పవన్‌ తనయుడు హీరో అవ్వాలని కోరుకుంటున్నారు.మెగా హీరోలతో ఆయన్ను చూసిన వారు ఖచ్చితంగా అకీరా హీరో అవుతాడేమో అంటున్నారు.