Mega DSC Notification : తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
TeluguStop.com
తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.ఈ మేరకు రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్( Mega DSC Notification ) విడుదల చేసింది.
సుమారు 11,062 పోస్టులతో సర్కార్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో( Minister Komatireddy Venkatreddy ) పాటు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు.
కాగా మొత్తం 11 వేల 62 టీచర్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది.
"""/" /
గతేడాది 5,089 పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ.
కొత్త పోస్టులు కలుపుకొని మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) సర్కార్ విడుదల చేసింది.
అయితే పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదని విద్యాశాఖ తెలిపింది.
కాగా వచ్చే విద్యా సంవత్సరానికి కొత్త ఉపాధ్యాయులు ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుందన్న సంగతి తెలిసిందే.
లండన్: ఇదేం ఖర్మరా బాబు.. లక్ష అద్దె కట్టినా చిల్లుల కొంపే.. భారతీయుడి ఆవేదన!