ఆ హీరో కోసం పోటీపడుతున్న మెగా డాటర్స్.. ఏమైందంటే?

మెగా కాంపౌండ్ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం మనకు తెలిసిందే.

అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో మెగా డాటర్స్ కూడా కొనసాగుతూ పెద్ద ఎత్తున సినిమాల విషయంలో పోటీపడుతున్నారు.

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు.

ఇకపోతే ఈమెకు పెళ్లి జరిగిన తర్వాత సినిమాలకు దూరమైనా నిర్మాణ రంగంలో స్థిరపడ్డారు.

ఈ క్రమంలోనే నిహారిక పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ఇన్ని రోజులపాటు కొనసాగుతూ ఉన్నటువంటి సుస్మిత వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా మారారు.

ఇకపోతే ఈమె కూడా ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్ లో సినిమాలతో బిజీగా ఉన్నారు.

అయితే ఇండస్ట్రీలో ఈ అక్క చెల్లెల మధ్య ఒక హీరో కోసం పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది.

సుస్మిత నిహారిక ఇద్దరు నిర్మాతలుగా సంతోష్ శోభన్ అనే హీరోతో సినిమాలు చేసిన విషయం మనకు తెలిసిందే.

సుస్మిత నిర్మాణంలో సంతోష్ శోభన్ శ్రీదేవి శోభన్ అనే సినిమాలో నటించారు.అలాగే నిహారిక నిర్మాణంలో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమాని చేశారు.

"""/"/ ఇకపోతే వీరిద్దరూ కూడా వారి సినిమాలు విడుదల విషయంలో పోటీ పడుతున్నారు అయితే ఈ పోటీలో భాగంగా నిహారికనే తన సినిమాని ముందుగా విడుదల చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

నవంబర్ 4వ తేదీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విడుదల చేయడానికి నిహారిక ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

ఈ సినిమా కన్నా శ్రీదేవి శోభన్ నిర్మాణం పూర్తి అయి కొన్ని నెలలు కావస్తున్న ఇప్పటివరకు ఈ సినిమా విడుదల విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు.

ఈ క్రమంలోనే నిహారిక నవంబర్ 4వ తేదీ ఈ సినిమాని విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

షాకిచ్చిన ట్రంప్ .. ప్రమాణ స్వీకారానికి రమ్మంటూ జిన్‌పింగ్‌కి ఆహ్వానం?