నిహారికకు ఎప్పుడు అదే పని.. ఫోటోతో అసలు విషయాన్నీ బయటపెట్టిన భర్త చైతూ?

మెగా డాటర్ కొణిదెల నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె తన చిలిపి చిలిపి మాటలతో అల్లరితో ఎంతోమంది ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది.

మెగా ఫ్యామిలీకి ముద్దుల కూతురుగా ఈమె సుపరిచితమే.ఇదిలా ఉంటే గత సంవత్సరం డిసెంబర్ 9న ఈమె జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.ఇక డిసెంబర్ 9 వారి ఫస్ట్ వెడ్డింగ్ అనివర్సరీ సందర్భంగా ఈ దంపతులిద్దరూ స్పెయిన్ కు పయనమయ్యారు.

ప్రస్తుతం నిహారిక, చైతన్య వెకేషన్ లో ఉన్నారు.అక్కడ ఈ జంట ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

స్పెయిన్, బార్సీలోనాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ, అక్కడ షాపింగ్ చేస్తూ, అక్కడి అందమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఫొటోలు దిగారు.

ఈ ఫోటోలను నిహారిక ఎప్పటికప్పుడు తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది.ఈ నేపథ్యంలోనే నిహారిక చైతన్యలు స్కై డ్రైవింగ్ గురించి మాట్లాడుకుంటూ ఒకరిపై ఒకరు పంచులు వేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"""/" / ఈ జంట అక్కడ ఒక హోటల్ కి డిన్నర్ చేయడానికి వెళ్లినట్లు తెలుస్తోంది.

అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.హోటల్ కి వెళ్లి అక్కడ తినకుండా నిహారిక తన ఫోన్ లో బిజీగా ఉంది.

అప్పుడు భర్త చైతన్య తన సెల్ఫీ తీస్తూ ఎప్పుడూ ఇదే పని ప్రతిక్షణం ఫోన్ లో ఇలా బిజీగా ఉంటుంది అంటూ నిహారిక మీద ఫిర్యాదు చేశాడు.

అలాగే నిహారిక ఫోన్ చూస్తున్నా మరొక ఫోటోని కాసేపటికి షేర్ చేస్తూ కొన్ని మిలియన్ల క్షణాల తర్వాత అంటూ కాప్షన్ ఇచ్చాడు.

ఈ దంపతులు షేర్ చేసిన ఫోటోలు, వీడియోలను చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

త్వరలోనే వీరి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా నెటిజన్లు ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

వేస‌విలో పొట్ట కొవ్వును క‌రిగించే బెస్ట్ స్మూతీ ఇది.. రోజూ తీసుకుంటే మ‌రిన్ని లాభాలు!