డాక్టర్ రమేష్ చిన్నమూల కు మెగాభినందనలు

గత 20 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో పాత్రికేయునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రమేష్ చిన్నమూల "మాస్ కమ్యూనికేషన్ " విభాగంలో డాక్టరేట్ సాధించారు.

తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాస్ కమ్యూనికేషన్ విభాగంలో పిహెచ్.డి పరిశోధక విద్యార్థిగా ప్రొఫెసర్ కె.

శివ శంకర్ పర్యవేక్షణలో “శ్యామ్ బెనెగల్ చలనచిత్రాలలో సామాజిక సమస్యల చిత్రణపై విశ్లేషణాత్మక అధ్యయనం: తెలంగాణ నేపథ్యం”(AN ANALYTICAL STUDY ON THE DEPICTION OF SOCIAL ISSUES IN SHYAM BENGAL FILMS:THE TELANGANA CONTEXT) అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంతగ్రంథం రూపొందించారు.

ఈ సందర్భంగా తనకు స్ఫూర్తి ప్రదాత అయిన పద్మభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవిని కలిసి ఆయన అభినందనలు అందుకున్నారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ “డాక్టర్ రమేష్ చిన్నమూలగారు ….

పట్టుదలతో పి.హెచ్.

డి .సాధించినందుకు నా అభినందనలు.

మీరు నా మాటకి స్పందిస్తూ…… ఫిల్మ్ జర్నలిజంలో అత్యున్నత స్థాయికి వెళ్లడమే కాకుండా, ఎంతో మందికి స్ఫూర్తిగా ఉండేలా డాక్టరేట్ సాధించడం నాకు సంతోషమే కాదు గర్వంగా ఉంది.

మీ పట్టుదల, దీక్ష భావితరాలకు స్ఫూర్తి అవుతుంది.ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు,సుఖసంతోషాలు కలుగ చేయాలి” అని అభినందనలతో కూడిన ఆశీర్వచనం అందించారు.

మెగాస్టార్ అందించిన ప్రశంసలతో డాక్టర్ రమేష్ చిన్నమూల మాట్లాడుతూ ““100 ఏళ్ల తెలుగు మూకీ సినిమా, 90 ఏళ్ల తెలుగు టాకీ సినిమా చరిత్రలో మాస్ కమ్యూనికేషన్లో పిహెచ్.

డి(Ph.D) పట్టా పొందిన తొలి సినీ పాత్రికేయుడుగా నిలవడం సంతోషంగా ఉంది.

నా కెరీర్ బిగినింగ్ లో ఇంటర్వ్యూ నిమిత్తం ‘స్టాలిన్’ షూటింగ్ టైం లో మెగాస్టార్ని కలిసినప్పుడు వారు చెప్పిన మాటలు, ఇచ్చిన ప్రోత్సాహం ఈ పిహెచ్.

డి(Ph.D) చేయడానికి స్ఫూర్తినిచ్చాయి.

డాక్టరేట్ సాధించిన సందర్భంగా ఇటీవల మెగాస్టార్ ని కలిసినప్పుడు వారు చూపించిన ఆదరణ, వెన్నుతట్టి అభినందించి, అందించిన ప్రోత్సాహం ఎప్పటికి మరువలేనిది.

నా జీవితంలో అవి మర్చిపోలేని మధుర క్షణాలు.ఈ అవకాశం, అదృష్టం కల్పించిన సినీ కళామతల్లికి జీవితాంతం రుణపడి ఉంటాను” అని పేర్కొన్నారు.

“తన సినీ ప్రయాణంలో ఎంతగానో సహకరించిన జర్నలిస్ట్ ప్రభు, ఎల్.ప్రదీప్, ప్రొఫెసర్ కె.

శివ శంకర్, తెలంగాణ రాష్ట్ర భాషా- సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సినీప్రముఖులు, పి.

ఆర్.ఓ లు , సహచర సినీ పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలియజేశారు” డాక్టర్ రమేష్ చిన్నమూల.

ఇతర రాష్ట్రాల డైరెక్టర్లకు ఓటేస్తున్న టాలీవుడ్ హీరోలు.. ఆ దర్శకులు నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా?