అందరి దారి ఒకటైతే, మెగా హీరోలది మరో దారి..ఏంటా కథ ?

సినిమా తీయాలంటే మంచి కథ కావాలి.తాజాగా కథలు అల్లుకొని సినిమా తీయడం వేరు.

ఉన్న చరిత్రను సినిమాగా తెరెక్కించడం వేరు.వాస్తవ చరిత్రను తెరమీద చూపించాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి.

కథలో ఏమాత్రం వక్రికరణ ఉండకూడదు.కథ ఏమాత్రం అటు ఇటు అయినా పలు రకాల ఇబ్బందులు వస్తాయి.

అసలే మనోభావాలు దెబ్బతింటున్న సమయంలో ఎవరి మనో భావాలకు ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలి.

చారిత్రక నేపథ్యంతో కూడిన సినిమాను తెరకెక్కించేందుకు ఉపయోగించే డబ్బు, మ్యాన్ పవర్ ఉపయోగిస్తే.

మూడు, నాలుగు సాంఘిక సినిమాలను తెరెక్కించవచ్చు.అయితే ఈ ఎంత రిస్క్ ఉన్న చారిత్రక సినిమాలను తీసేందుకే మొగ్గు చూపుతున్నారు మెగా హీరోలు.

తాజాగా సైరా సినిమా చేసి చిరంజీవి మంచి విజయాన్ని అందుకున్నాడు.ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించాడు.

"""/"/ అటు చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ సైతం ప్రస్తుతం ఓ చారిత్ర నేపథ్యం కలిగిన సినిమా చేస్తున్నట్లు తెలుస్తోందిజ.

దర్శకుడు క్రిష్.పవన్ క్రేజ్ కు తగిన విధంగా మొఘల్ కాలోం జరిగిన ఓ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఈ కథలో పవన్ దొంగ పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన పవన్ లుక్.

మూవీపై అంచనాలను భారీగా పెంచింది.ఎఎమ్ రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

దసరాలకు ఈ సినిమా రిలీజ్ కానుంది. """/"/ అటు రాంచరణ్ కూడా తాజాగా చారిత్ర నేపథ్యం కలిగిన ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.

ఇందులో ఆయన అల్లూరి సీతారామ రాజు పాత్రను పోషిస్తున్నాడు.ఈ జెనరేషన్ హీరోల్లో చెర్రీ ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసేఅవకాశాన్ని దక్కించుకున్నాడు.

తాజాగా విడుదల అయిన ప్రోమోలో రామ్ చరణ్ నట విశ్వరూపం కనిపించింది.మార్చి 25న ఈ సినిమా జనాల ముందుకు రానుంది.

"""/"/ అటు మెగా కాంపౌడ్ హీరో అల్లు అర్జున్ కూడా చారిత్ర నేపథ్యం కలిగిన రుద్రమదేవి సినిమాలో పవర్ ఫుల్ క్యారెక్టర్ చేశాడు.

ఈ సినిమాలో ఆయన నటించిన గోన గన్నారెడ్డి పాత్ర సినిమాకే హైలెట్ అయ్యింది.

గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనాల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది.

తెలంగాణ యాసలో సూపర్ డైలాగులు చెప్తూ అల్లు అర్జున్ జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాడు.

సౌత్ ఆఫ్రికన్ బిర్యానీ ఇండియన్ బిర్యానీ కంటే రుచిగా ఉంటుందా..?