వైసీపీ నేతలకు మెగా బ్రదర్ నాగబాబు సవాల్
TeluguStop.com
వైసీపీ నేతలపై మెగా బ్రదర్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
జనసేన పార్టీకి 175 సీట్లలో పోటీ చేసే దమ్ముందా అంటూ మంత్రులు, మాజీ మంత్రులు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఘాటుగా స్పందించిన నాగబాబు.వైసీపీలోని కేతిగాళ్లు, జుట్టు పోలిగాళ్లు, అల్లాటప్పా గోంగూరమ్మలకు రెండు సవాళ్లు చేస్తున్నట్లు తెలిపారు
అనంతరం ఆయన కేతిగాళ్లు, జుట్టు పోలిగాళ్లు, అల్లాటప్పా గోంగూరమ్మలు అన్నానని తప్పుగా భావించొద్దన్నారు.
ఆ పాత్రలను కళారూపాల్లో ఒకటైన తోలుబొమ్మలాట నుంచి తీసుకున్నట్లు తెలిపారు.వైసీపీ తోలుబొమ్మలాట పార్టీనే కదా అని ఎద్దేవా చేశారు.
అనంతరం ముందస్తు ఎన్నికలకు రాకుండా ఐదేళ్లపాటు పాలించే దమ్ము వైసీపీకి ఉందా అని ప్రశ్నించారు.
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని మీ నాయకుడితో చెప్పించగలరా అని నిలదీశారు.అదేవిధంగా నవరత్నాల థావోస్ రెడ్డికి దమ్ముంటే పవన్ తో చర్చకు రావాలని సవాల్ విసిరారు.
బాలయ్యకు ఇవ్వడం ఓకే.. వీళ్లకెందుకు పద్మ పురస్కారాలు ఇవ్వడం లేదు?