ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ… మెగా బ్రదర్ కూ ఛాన్స్

ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీకి టిడిపి అధినేత,  ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) శ్రీకారం చుట్టారు .

ఏపీలో టిడిపి,  జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల విషయమై చాలామంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు.

ఇప్పటి వరకు దాదాపు 23,000 మంది నామినేటెడ్ పదవుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఈ పదవుల భర్తీ విషయంలో ఇప్పటికే జనసేన అధినేత , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Deputy CM Pawan Kalyan ),  ఏపీ బీజేపీ అధ్యక్షురాలు , రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందరేశ్వరితో( MP Daggupati Purandareshwari ) చంద్రబాబు చర్చించారు.

ఈ సందర్భంగా దశలవారీగా ఈ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు.మూడు పార్టీలలోని నాయకులకు ఏ విధంగా పదవులు కేటాయించాలనే విషయం పైన ఒక క్లారిటీకి వచ్చారు.

అలాగే టిడిపి సీనియర్లకు కీలక పదవులు ముందుగా ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. """/" / టిడిపి సీనియర్లతో పాటు, జనసేన , బిజెపిలోని( Janasena, BJP ) ముఖ్యమైన నాయకులకు రాష్ట్రస్థాయి పదవులు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు .

మెగా బ్రదర్ నాగబాబుకూ( Mega Brother Nagababu ) కీలకమైన పదవిని కేటాయించబోతున్నట్లు సమాచారం.

  అలాగే బిజెపిలో ఎంపీ,  ఎమ్మెల్యే సీట్లు ఆశించి భంగపడిన నేతలకు కీలకమైన నామినేటెడ్ పదవులు ఇవ్వబోతున్నారట.

టిడిపి సీనియర్ నేత,  మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఆర్టీసీ చైర్మన్ , ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీఐఐసీ చైర్మన్ , పట్టాభికి పౌరసరఫరాల కార్పొరేషన్,  మాజీ మంత్రి పీతల సుజాతకు ఎస్సీ కమిషన్,  మరో మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ కు ఎస్టి కమిషన్ చైర్మన్ ఖరారు అయినట్లు తెలుస్తోంది .

జనసేన కీలక నేత మంత్రి నాదెండ్ల మనోహర్ కు తెనాలి సీటు కేటాయించడంతో  అక్కడ సీటు కోల్పోయిన టిడిపి సీనియర్ నేత,  మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు అమరావతికి సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం .

"""/" / రాష్ట్రవ్యాప్తంగా 90 వరకు కార్పొరేషన్లు ఉండగా , వాటి చైర్మన్ లు , అందులో మెంబర్లు కలిసి వందల్లోనే పోస్టులు ఉన్నాయి.

  ఇవి మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారీగా భర్తీ చేయాలని భావిస్తున్నారు.

దాదాపు 30% పదవులు తొలి విడతలోనే భర్తీ చేయనున్నట్లు సమాచారం.అలాగే టిటిడి బోర్డు ఏర్పాటు పైన ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.

  ఓ మీడియా సంస్థ అధినేతకు టీటీడీ చైర్మన్ పదవిని కేటాయించబోతున్నట్లు సమాచారం.

వావ్, 3 గంటల్లోనే మర్డర్ కేస్ సాల్వ్ చేసిన ముంబై పోలీస్..!