మెఫి మానసిక దివ్యాంగుల కేంద్రానికి.. శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆటో వితరణ

ఖమ్మం నగరంలోని జలగం నగర్ ప్రాంతంలో ఉన్న మెఫీ మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రానికి శ్రీ రామకృష్ణ సేవా సమితి వారు స్థానిక రాజమండ్రి రామకృష్ణ మిషన్ అధ్యక్షులు స్వామి వినిశ్చలానంద గారి చేతుల మీదుగా మూడు లక్షల విలువైన ఆటో ను బహూకరించారు .

సమితి అధ్యక్షులు డాక్టర్ రామ్ కిషన్ రావ్ , కార్యదర్శి సత్యప్రసాద్ రాయ్ , జోనల్ కో ఆర్డినేటర్ పరాశరం ప్రసాదు , మెఫీ సంస్థ కార్యదర్శి ప్రమీల , సమితి బాధ్యులు , పెద్దలు స్వామీజీకి భక్తితో స్వాగతం పలికారు .

 ఈ సందర్బంగా జరిగిన సభలో అధ్యక్షులు రామ్ కిషన్ రావ్  మాట్లాడుతూ ఖమ్మం సమితి చేస్తున్న సేవా కార్యాలను వివరించారు .

సత్యప్రసాద్ రాయ్ మాట్లాడుతూ దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు .దివ్యాంగులలో భగవంతుడిని చూస్తూ సేవాభావంతో ఖమ్మం సమితివారు చేపట్టిన కార్యాన్ని పరాశరం ప్రసాదు ప్రశంసించారు .

మెఫీ సంస్థ కార్యదర్శి ప్రమీల మాట్లాడుతూ తాను , తన కుటుంబం రెండు దశాబ్దాలుగా  అనేక వ్యయ ప్రయాసలకోర్చి దివ్యాంగుల సేవలో తరిస్తున్నట్లు చెప్పారు .

స్వామిజీ అనుగ్రహ భాషణంలో సంస్థ సేవా దృక్పథాన్ని కొనియాడుతూ సౌకర్యాలు మెరుగుపరచుకోవాలని , శ్రీ రామకృష్ణులపై విశ్వాసంతో పనిచేయాలని , ఆర్ధిక వ్యవహారాల్లో పారదర్శకత ఉన్న సంస్థలకు విరాళం ఇవ్వటానికి దాతలు ముందుకు వస్తారని చెబుతూ రాజమండ్రి మఠం మిషన్ ద్వారా జరుగుతున్న అనేక సేవా కార్యాలకు విరాళాలు అందటానికి కారణం అదే అన్నారు .

దివ్యాంగులకు ఆశీస్సులు అందించి ప్రసాదం ఇచ్చారు .విడాల్ సంస్థ రామకృష్ణ ఆటోకు కావాల్సిన లూబ్రికెంట్స్ ను ఉచితంగా అందిస్తాననని చెప్పారు .

సహకార్యదర్శి వెంకట్రావ్ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆటో నిర్వహణకు మెఫీ సంస్థకు ప్రతి నెలా 2000 రూపాయల విరాళం ప్రకటించారు .

 ఈ కార్యక్రమంలో సమితి బాధ్యులు ఆశాకుమారి .ఎం.

కె.ఆచార్యులు , శారద , నాగమణి , కేశవ్ పటేల్ , మొదలైన వారు మరియు దాతలు పాల్గొన్నారు .

గేమ్ ఛేంజర్ రా మచ్చా మచ్చా సాంగ్ లో వీణ స్టెప్ అదుర్స్.. మ్యాజిక్ రిపీట్ చేశారుగా!