రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

రాజన్న సిరిసిల్ల జిల్లా :రానున్న పార్లమెంట్ ఎన్నికల( Parliament Elections ) నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్(రెవెన్యూ) ఎన్.

ఖీమ్యా నాయక్( Kheemya Naik ) సమావేశం నిర్వహించారు.పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారంలో భాగంగా వినియోగించే వస్తువులు, పరికరాల ధరలపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు అదనపు కలెక్టర్ అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) మార్గదర్శకాల మేరకు నిర్దేశించిన ధరల పట్టికను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేసి, వాటిపై అవగాహన కల్పించారు.

ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయా పార్టీల ప్రతినిధులకు అదనపు కలెక్టర్ సూచించారు.

సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

చిరంజీవితో సినిమా చేయాలంటే ఈ ఆస్థాన రచయితల సలహాలు కూడా తీసుకోవాల్సిందే…