మునుగోడు ఉప ఎన్నికపై తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ

మునుగోడు ఉప ఎన్నికపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు.సాయంత్రం టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నరని సమాచారం.

ఈ భేటీలో పార్టీ ముఖ్యనేతలతో పాటు మునుగోడు మండల, క్లస్టర్ ఇంఛార్జ్‌లు పాల్గొననున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించనున్నారని తెలుస్తోంది.

అదేవిధంగా పోల్‌ మేనేజ్‌మెంట్‌తో పాటు పలు అంశాలపై నేతలు చర్చించే అవకాశం ఉంది.

కాగా ఇప్పటికే మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

బన్నీకి లక్ కలిసొచ్చి పుష్ప2 హిట్టైందా.. తర్వాత సినిమాలకు ఈ స్థాయి కలెక్షన్లు కష్టమేనా?