భవిష్యత్ కార్యాచరణపై వామపక్ష పార్టీల సమావేశం..!

తెలంగాణలో రానున్న ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సీఎం కేసీఆర్ వామపక్షాలకు ఎటువంటి సీట్లను కేటాయించలేదన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో వామపక్ష పార్టీలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు సిద్ధం అయ్యాయని తెలుస్తోంది.

ఈ మేరకు ఇవాళ లెఫ్ట్ పార్టీలు వేర్వేరుగా భేటీ కానున్నారు.సీపీఐ, సీపీఎం రాష్ట్ర నాయకత్వాలు సమావేశం అయి తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాయని సమాచారం.

అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలో కలిసి పని చేసిన వామపక్ష పార్టీలకు సీఎం కేసీఆర్ అభ్యర్థుల జాబితాలో ఒక్క సీటు కూడా కేటాయించలేదన్న సంగతి తెలిసిందే.

దీంతో ఖంగుతున్న వామపక్షాలు బీఆర్ఎస్ పై తీవ్రంగా మండిపడుతున్నాయి.ఈ క్రమంలోనే బలం ఉన్న ప్రతి చోట పోటీ చేయాలని సీపీఎం భావిస్తోంది.

వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే మేకప్ అక్కర్లేదు.. న్యాచురల్ బ్యూటీ అయిపోతారు!