ఐర్లాండ్‌లో మేయర్‌గా ఎన్నికైన మలయాళీ.. తొలి భారత సంతతి నేతగా చరిత్ర
TeluguStop.com
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు కీలక స్థానాలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా ఆయా దేశాల్లో రాజకీయ నాయకులుగా రాణిస్తున్నారు.తాజాగా కేరళలోని( Kerala ) అంగమాలి సమీపంలోని పులియానం అనే చిన్న పట్టణానికి చెందిన బేబీ పెరెప్పదాన్( Baby Pereppadan ) ఐర్లాండ్‌లో మేయర్‌గా ఎన్నికయ్యారు.
తద్వారా ఈ దేశంలో మేయర్‌గా ఎన్నికైన తొలి భారత సంతతికి చెందిన వ్యక్తిగా పెరెప్పదాన్ చరిత్ర సృష్టించారు.
23 సంవత్సరాల క్రితం ఆయన భారత్ నుంచి ఐర్లాండ్‌కు( Ireland ) వలస వెళ్లారు.
జూన్ 7న జరిగిన కౌన్సిల్ ఎన్నికల తర్వాత పెరెప్పదాన్ సౌత్ డబ్లిన్ కౌంటీ కౌన్సిల్ మేయర్‌గా( South Dublin County Council Mayor ) ఎన్నికయ్యారు.
సౌత్ డబ్లిన్ కౌన్సిల్ జనాభా సుమారు 3 లక్షలు.సౌందర్య సాధనాల పంపిణీ వ్యాపారంలో ఉన్న పెరెప్పదాన్.
తల్లాట్ సౌత్ ఎలక్టోరల్ ఏరియా ప్రతినిధిగా రెండవసారి ఎన్నికయ్యారు.సౌందర్య సాధనాల పంపిణీ వ్యాపారంలో ఉన్న పెరెప్పదాన్ .
తల్లాట్ సౌత్ ఎలక్టోరల్ ఏరియా ప్రతినిధిగా రెండవసారి ఎన్నికయ్యారు. """/" /
వృత్తిరీత్యా వైద్యుడు అయిన అతని కుమారుడు బ్రిట్టో పెరెప్పదాన్( Britto Pereppadan ) సైతం ఎన్నికల రాజకీయాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుని తల్లాట్ సెంట్రల్‌లో విజేతగా నిలిచాడు.
కౌన్సిల్ ఎన్నికల్లో బేబీ పెరెప్పదాన్ .మేయర్‌గా( Mayor ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
2009లో స్వతంత్ర అభ్యర్ధిగా ఎన్నికల బరిలోకి దిగిన ఆయన కేవలం 65 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
2014లో పెరెప్పదాన్ .ఫైన్ గేల్ పార్టీలో చేరి 2019లో అభ్యర్ధిగా ఎంపికయ్యారు.
"""/" /
నర్సు జిన్సీ పెరెప్పదాన్‌ని పెళ్లాడిన ఆరు నెలల తర్వాత జీవిత భాగస్వామి వీసాపై ఆయన ఐర్లాండ్‌కు వలస వెళ్లారు.
జిన్సీ ఇప్పుడు ప్రీమౌంట్ హాస్పిటల్‌లో అడ్వాన్స్‌డ్ నర్సింగ్ ప్రాక్టీషనర్.ఈ దంపతులకు డెంటల్ సైన్స్ విద్యార్ధిని అయిన బ్రోనా పెరెప్పదాన్ అనే కుమార్తె కూడా ఉంది.
రాజకీయాల్లో కేరళలోని నాయకుల నమూనాను అనుకరించేందుకు ప్రయత్నించాను.ఎవరైనా సమస్యను ఎదుర్కొంటే , దానిని పరిష్కరించడానికి తాను నేరుగా సంభాషించడానికి ప్రయత్నిస్తానని పెరెప్పదాన్ తెలిపారు.
తల్లాట్ సౌత్‌లో దాదాపు 38,000 మంది నమోదిత ఓటర్లు ఉండగా.వారిలో 450 మంది మలయాళీలు.
మరోసారి బుక్ అయిన రష్మిక విజయ్ దేవరకొండ… ఇప్పటికైనా ఒప్పుకుంటారా?