రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధి భార్య మన భారత సంతతి వ్యక్తే.. ఎవరీ ఉషా చిలుకూరి..?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా డొనాల్డ్ ట్రంప్‌ ( Donald Trump )పేరును అధికారికంగా నామినేట్ చేశారు.

మిల్వాకీలో సోమవారం జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో ప్రతినిధులు ట్రంప్ అభ్యర్ధిత్వానికి ఆమోదం తెలిపారు.

ఈ నేపథ్యంలో తన రన్నింగ్ మేట్ (ఉపాధ్యక్ష అభ్యర్ధి)గా ఒహియో సెనేటర్ జేడీ వాన్స్‌( JD Vance ) పేరును డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో వాన్స్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది.ఆయన నేపథ్యం, చదువు, రాజకీయరంగ ప్రవేశం గురించి తెలుసుకోవాలని నెటిజన్లు ఆన్‌లైన్‌లో జల్లెడ పడుతున్నారు.

ఈ క్రమంలోనే ఆయన భార్య , ఆమె నేపథ్యం కూడా చర్చకు దారితీసింది.

"""/" / జేడీ వాన్స్ సతీమణి భారత సంతతి వ్యక్తి కావడం గమనార్హం.

ఆమె పేరు ఉషా చిలుకూరి వాన్స్( Usha Chilukuri Vance ).ఆమె తల్లిదండ్రులు కొన్నేళ్ల కిందట అమెరికాకు వలసవెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌డియాగో ప్రాంతంలో ఉషా బాల్యం గడిచింది.యేల్ యూనివర్సిటీలో చరిత్రలో ఉషా గ్రాడ్యుయేషన్ చేశారు.

అలాగే కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ అందుకున్నారు.అమెరికా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జాన్ రాబర్ట్స్, జస్టిస్ బ్రెట్ కెవానా తదితరుల దగ్గర ఆమె పనిచేశారు.

యేల్ యూనివర్సిటీలో లా అండ్ టెక్ జర్నల్‌కు మేనేజింగ్ ఎడిటర్‌గా, యేల్ లా జర్నల్‌కు ఎగ్జిక్యూటివ్ డెవలప్‌మెంట్ ఎడిటర్‌గానూ ఉషా సేవలందించారు.

2015 నుంచి ముంగర్, టోల్స్, ఓస్లాన్ న్యాయ సంస్థలలో కార్పోరేట్ లిటిగేటర్‌గా పనిచేస్తున్నారు.

"""/" / యేల్ లా స్కూల్‌లో ఉండగానే ఉషా, జేడీ వాన్స్‌ల మధ్య పరిచయం జరిగింది.

ఇది ప్రేమగా మారి, 2014లో కెంటుకీలో వివాహం చేసుకున్నారు.వీరి పెళ్లి హిందూ సంప్రదాయంలో జరగడం విశేషం.

వాన్స్ దంపతులకు ముగ్గురు పిల్లలు.భర్తకు చేదోడు వాదోడుగా ఆయన విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు ఉషా.

హిల్‌బిల్లీ ఎలెజీ పుస్తకం రచనతో పాటు ఒహియో సెనేటర్‌గానూ వాన్స్ పోటీ చేసిన సమయంలో ఆమె అండగా నిలిచారు.

ధనవంతులను ఎలా పెళ్లి చేసుకోవాలో ఐడియాలు ఇస్తూ.. కోట్లు సంపాదిస్తోంది..!