చెత్త డబ్బా దగ్గర దొరికిన ఈ చిన్నారి ప్రస్తుతం స్టార్ హీరో కూతురని మీకు తెలుసా?

బాలీవుడ్ సినిమాలలో నటించడం ద్వారా మిధున్ చక్రవర్తి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారనే విషయం తెలిసిందే.

మిధున్ చక్రవర్తి బెంగాళీ అయినప్పటికీ బాలీవుడ్ సినిమాల ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్నారు.

డిస్కో డ్యాన్సర్ అనే సినిమా నటుడిగా మిధున్ చక్రవర్తికి మంచి పేరును తెచ్చిపెట్టింది.

మిధున్ చక్రవర్తి నటనకు పలు పురస్కారాలు లభించాయి.మిధున్ చక్రవర్తి ఉత్తమ నటుడిగా అవార్డులను సొంతం చేసుకోవడంతో పాటు ఉత్తమ సహాయనటుడిగా కూడా అవార్డులను పొందారు.

అయితే ఈ మిధున్ చక్రవర్తి రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో కావడం గమనార్హం.

మిధున్ చక్రవర్తికి నిజ జీవితంలో ఉష్మే, నమషి, మహాక్షయ్ పేర్లతో ముగ్గురు కొడుకులు ఉన్నారు.

వీరితో పాటు దిశానీ పేరుతో ఒక కూతురు కూడా ఉన్నారు.అయితే దిశానీ దత్త పుత్రిక కావడం గమనార్హం.

"""/"/ చెత్త డబ్బా దగ్గర ఏడుస్తున్న ఒక చిన్నారికి సంబంధించిన వార్త మిధున్ చక్రవర్తిని కదిలించింది.

ఆ పాప ముఖం చూడగానే తనకు, ఆ పాపకు ఏదో తెలియని అనుబంధం ఉందని మిధున్ చక్రవర్తికి అనిపించింది.

ఆ తర్వాత మిధున్ భార్యతో మాట్లాడి చిన్నారిని ఇంటికి తీసుకొని వచ్చాడు.ఆ తర్వాత మిధున్ దంపతులు దత్తత కార్యక్రమాలను పూర్తి చేశారు.

"""/"/ దిశానీ చక్రవర్తి ప్రస్తుత ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ప్రస్తుతం దిశానీ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ కోర్సును నేర్చుకుంటున్నారు.

హోలీ స్మోక్ ఆనే లఘు చిత్రం ద్వారా ఇప్పటికే ప్రేక్షకులకు సుపరిచితమైన దిశానీ భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ గా రాణిస్తారేమో చూడాల్సి ఉంది.

అందంగా ఉన్న దిశాని భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ అవుతారని ఆమె అభిమానులు భావిస్తున్నారు.

దిశానీకి సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది.

వీడియో వైరల్: మండే ఎండల నుంచి రిలాక్స్ కావాలంటే ఇంటిని ఇలా చేసుకుంటేపోలే..