రోజుకి లక్ష చీరలు, లక్ష టీ షర్ట్స్‌ అమ్ముతున్న మీషో.. 2022లో దాని రికార్డ్స్ ఇవే!

ఈరోజుల్లో ఎవరూ బయటికి వెళ్లి షాపింగ్ చేయడం లేదు.స్మార్ట్‌ఫోన్ ద్వారా షాపింగ్ యాప్స్ లో తమకేం కావాలో ఆర్డర్ చేసి అన్నీ ఇంటికి తెప్పించుకుంటున్నారు.

ఆ షాపింగ్ యాప్స్‌లో మీషో యాప్ టాప్ ప్లేస్ లో నిలుస్తోంది.ఇక ఈ ఏడాది మీషో ప్లాట్‌ఫామ్‌లో ప్రతిరోజూ దాదాపు 93,000 టీ-షర్ట్స్, 51,725 బ్లూటుత్ ఇయర్‌ఫోన్స్, 21,662 లిప్‌ స్టిక్స్ అమ్ముడయ్యాయి.

హర్యానాలో బెడ్‌షీట్స్, జార్ఖండ్‌లో ఎక్స్‌టెన్షన్ బోర్డులు, అస్సాంలో బాడీ లోషన్స్ ని ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేశారట.

మీషో రీసెంట్‌గా తన యాప్‌లో 2022లో ఇండియన్స్ ఎలా షాపింగ్ చేసారో మీషో తన నివేదికలో వెల్లడించింది.

ఆ డేటా ప్రకారం 2022 లో మీషో ప్లాట్‌ఫామ్‌లో ఎక్కువగా అమ్ముడు పోయిన వస్తువులు ఒకటి స్మార్ట్ వాచ్.

అలానే ఫిట్నెస్ పరికరాలలో 'డంబెల్స్, ట్రెడ్ మీల్స్' లాంటివి ఎక్కువగా అమ్ముడుపోయాయి.బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, ముంబై, హైదరాబాద్ లాంటి నగరాల వారు యోగా మ్యాట్స్ ని అధికంగా కొనుగోలు చేశారు.

ఇక ఈ ఏడాది మీషో ప్లాట్‌ఫామ్‌లో 91 కోట్ల ఆర్డర్స్ పెరిగాయట.ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన ఒక కస్టమర్ గంటకొక ఐటమ్ ఆర్డర్ చేస్తారట.

"""/"/ అతను 2022వ సంవత్సరంలో మొత్తం 6384 ఆర్డర్స్ చేసారట.అలానే ఆదివారం రోజు ఆ కస్టమర్ ఇంకెక్కువ షాపింగ్ చేస్తారు.

ప్రతి రోజు ఉదయనే 8 గంటల నుండి షాపింగ్ మొదలు పెడతారు.ఇక ఈ ప్లాట్‌ఫామ్‌లో నిమిషానికి 148 చీరల వరకు అమ్ముడవుతాయి.

అయితే ఈ ఏడాది మీషో యాప్ ద్వారా అమ్మకాలు చేసే వారికి కమిషన్స్‌లో దాదాపు రూ.

3,700 కోట్లు వరకూ ఆదా చేసారని, అంతేకాకుండా 130,000 మంది మీషోలో అమ్మకాలు జరిపి లక్షాధిపతులుగా మారారని, అలానే 6000 మంది కోటీశ్వరులుగా మారారని ఈ - కామర్స్ సంస్థ తన నివేదికలో పేర్కొంది.

నోటి దూల కారణంగా కోటి రూపాయలు నష్టపోయిన తేజ..??