తొందర్లోనే త్రిష వీడియోలు బయటపెడతా అంటున్న హీరోయిన్…
TeluguStop.com
తెలుగులో దాదాపుగా సీనియర్ నుంచి జూనియర్ వరకు అందరి హీరోలను కవర్ చేస్తూ నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తమిళ్ బ్యూటీ త్రిష కృష్ణన్ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.
అయితే తాజాగా ఈ అమ్మడి పై కోలీవుడ్ హీరోయిన్ మరియు బిగ్ బాస్ మూడవ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న మీరా మిథున్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.
అయితే ఇందులో భాగంగా తనకి కృష్ణ త్రిష అప్పట్లో పలు చిత్ర అవకాశాలను వరించకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది.
అంతేగాక త్రిష తమిళ సినీ పరిశ్రమకు చెందినటువంటి ఓ మాఫియాతో కూడా చేతులు కలిపిందని తొందర్లోనే ఈ విషయానికి సంబంధించిన వీడియోలను బయట పెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
దీంతో త్రిషపై మీరా మిథున్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో దుమారం రేపుతున్నాయి.
అంతేగాక మరికొంత మంది నెటిజన్లు ఈ విషయం గురించి స్పందిస్తూ సినిమా పరిశ్రమలో పలు కారణాల వల్ల ఒకానొక సమయంలో కొందరిని అనుకోకుండా దర్శక నిర్మాతలు తమ చిత్రాల నుంచి తొలగించాల్సి వస్తుందని దాంతో ఏకంగా ఈ విషయాన్ని మాఫియాతో ముడి పెట్టడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా త్రిష కృష్ణన్ ప్రస్తుతం పలు తమిళ చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.
కాగా తెలుగులో ఈ అమ్మడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "ఆచార్య" అనే చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నప్పటికీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.
జాక్ మూవీకి ఫ్లాప్ టాక్.. హీరో సిద్ధు జొన్నలగడ్డ అలా చేస్తే బెటర్ అంటూ?